Market Holidays: మార్చి నెలలో ఇక మిగిలి ఉన్నది కేవలం 11 రోజులు మాత్రమే. అయితే ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు వరుస సెలవులు ఉన్నందున ట్రేడింగ్ ఉండబోదని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ప్రకటించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు వారాల్లో 6 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయి. వివరాల్లోకి వెళితే.. దేశీయ స్టాక్ మార్కెట్ మార్చి నెల చివరి 11 రోజుల్లో సెలవులు అధికంగా ఉన్నట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తమ అధికారిక వెబ్‌సైట్ సెలవుల జాబితాలో పొందుపరిచాయి. ఈ క్లోజింగ్ సమయంలో స్టాక్ మార్కెట్‌లో ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్‌ఎల్‌బీ సెగ్మెంట్‌లోని అన్ని ట్రేడింగ్‌లు మూసివేయబడతాయి.

మార్చి 2024లో స్టాక్ మార్కెట్ సెలవులు..
మార్చి 23: శనివారం సెలవు
మార్చి 24: ఆదివారం సెలవు
మార్చి 25 (సోమవారం): హోలీ సెలవు
మార్చి 29 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సెలవు
మార్చి 30: శనివారం సెలవు
మార్చి 31: ఆదివారం సెలవు
మార్చి నెల చివరి వారంలో వరుసగా చివరి మూడు రోజులు మార్కెట్లు సెలవులో ఉండనున్నాయి. అంటే ఈ వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే మార్కెట్లు పనిచేస్తాయి. అలాగే సెలవు కాబట్టి మార్చి 25, మార్చి 29 తేదీల్లో కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ఎటువంటి ట్రేడింగ్ కొనసాగదని ఎక్స్ఛేంజీలకు కూడా సమాచారం అందించబడింది. దీనిని ఇన్వెస్టర్లు గమనించాలి. మార్చి 25న హోలీ సందర్భంగా.. కమోడిటీ అండ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదు (EGR) విభాగాలలో ఉదయం లావాదేవీలు, అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జరిగే లావాదేవీలు మూసివేయబడతాయి. కానీ MCXలో సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్ కొనసాగుతుంది. అయితే గుడ్ ఫ్రైడే మార్చి 29న ఉదయం, సాయంత్రం సెషన్లు పూర్తిగా సెలవులో ఉండనున్నాయి.
వారాంతపు సెలవులు కాకుండా.. దేశీయ స్టాక్ మార్కెట్ 2024లో మొత్తం 10 రోజుల పాటు మూసి ఉంటాయి. స్టాక్ మార్కెట్లు ఏప్రిల్‌లో రెండు రోజులు, మే-జూన్-జూలై-ఆగస్టు, అక్టోబరులో ఒక్కో రోజు మూతపడతాయి. ఇది కాకుండా నవంబర్ నెలలో రెండు రోజులు మార్కెట్ మూసివేయబడుతుంది. డిసెంబర్ నెలలో మార్కెట్ 1 రోజు క్లోజ్ కానున్నట్లు అధికారిక సెలవుల జాబితాలో స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications