Market Holiday on Christmas: దేశీయ స్టాక్ మార్కెట్లలో లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు ప్రస్తుతం పెట్టుబడులు పెడుతున్నారు. అయితే చాలా మందికి మార్కెట్లు ఎప్పుడెప్పుడు సెలవులో ఉంటాయి లేదా ఓపెన్ అయి ఉంటాయనే విషయంపై అవగాహన లేదు. అయితే ఇప్పుడు అందరి దృష్టి క్రిస్టమస్ రోజున మార్కెట్లు సెలవులో ఉంటాయా లేక పనిచేస్తున్నాయా అనే గందరగోళంలో ఉన్నారు.
2024 చివరికి వచ్చిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలో చివరి సెలవును డిసెంబర్ 25న క్రిస్టమస్ సందర్భంగా కలిగి ఉండనున్నాయి. ఈ క్రమంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలు బుధవారం రోజున సెలవులో ఉండనున్నాయి. ఇది ప్రస్తుత సంవత్సరంలో చివరి స్టాక్ మార్కెట్ సెలవు. పైగా ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అనేక స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా అమెరికా, యూకే, యూరప్ దేశాల్లోని స్టాక్ మార్కెట్లు క్రిస్టమస్ పండుగ సందర్భంగా సెలవులను ప్రకటించాయి. తిరిగి డిసెంబర్ 26న స్టాక్ మార్కెట్లు తమ కార్యక్రమాలను తిరిగి స్టార్ట్ చేయనున్నాయని తెలుస్తోంది.

క్రిస్టమస్ రోజు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈక్విటీలు, డెరివేటివ్‌లు, సెక్యూరిటీల లెండింగ్ అండ్ బారోయింగ్ తో సహా అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ను నిలిపియబడ్డాయని ఇన్వెస్టర్లు, ట్రేడర్లు గుర్తించాలి. ఇదే క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, నేషనల్ కమోడిటీ & డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్‌తో సహా కమోడిటీ మార్కెట్లు.. ఉదయం, సాయంత్రం రెండు సెషన్‌లకు సెలవుగా తెలుస్తోంది. డిసెంబర్ 2024లో స్టాక్ మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే.. నిఫ్టీ ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటి, ఫార్మా, రియల్టీ గ్రీన్‌లో ఉన్నాయి. ఇది బలమైన పెట్టుబడిదారుల ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్, మీడియా, మెటల్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
2025లో స్టాక్ మార్కెట్ సెలవులు..
రానున్న సంవత్సరంలో స్టాక్ మార్కెట్లకు చాలా తక్కువ రోజులు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. దీనికి అనుగుణంగా ట్రేడర్లు తమ పెట్టుబడి ప్రణాళికలు రెడీ చేసుకుని ఉత్తమ పోర్ట్ ఫోలియోను సిద్ధం చేసుకోవటం ఉత్తమం. మహాశివరాత్రికి ఫిబ్రవరి 26న, హోలీకి మార్చి 14న, రంజాన్ ఈద్ కోసం మార్చి 31న మార్కెట్లు మూసివేయబడతాయి. ఏప్రిల్‌లో శ్రీ మహావీర్ జయంతి కోసం ఏప్రిల్ 10, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కోసం ఏప్రిల్ 14, గుడ్ ఫ్రైడే కోసం ఏప్రిల్ 18న సెలవులో ఉండనున్నాయి.
మే 1న మహారాష్ట్ర దినోత్సవం, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్లు సెలవులో ఉండనున్నాయి. ఆగస్టులో గణేష్ చతుర్థి కోసం 27న మార్కెట్ మూసివేయబడుతుంది. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి/దసరా, అక్టోబర్ 21న దీపావళి లక్ష్మీ పూజ, అక్టోబర్ 22న దీపావళి బలిప్రతిపాదతో సహా అక్టోబర్‌లో మూడు సెలవులు ఉన్నాయి. నవంబర్ 5న ప్రకాష్ గురుపూర్బ్ శ్రీ గురునానక్ దేవ్‌కు రిజర్వ్ చేయబడింది. డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవుల క్యాలెండరులో ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications