Market Holidays 2023: ఏప్రిల్ 4న దేశీయ స్టాక్ మార్కెట్లకు మహావీర్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించటం జరిగింది. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు మూతపడ్డాయి. అయితే దేశంలోని ప్రముఖ కమోడిటీ ఎక్స్ఛేంజ్ MCX కూడా మొదటి ట్రేడ్ సెషన్ కోసం మూసివేయబడుతుంది. కానీ సాయంత్రం 5 గంటలకు రెండవ సెషన్ కోసం తెరవబడుతుంది.
వారాంతపు సెలవులను పరిగణలోకి తీసుకోకుంటే 2023 సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు 12 రోజుల పాటు సెలవులను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ మాసంలోని సెలవులను గమనించినట్లయితే.. BSE వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 4న మహావీర్ జయంతి, ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్రేడింగ్ నిలిపివేయబడుతుంది. ఇవి కాకుండా వారాంతపు సెలవుల్లో సైతం మార్కెట్లు అందుబాటులో ఉండవని ఇన్వెస్టర్లు గమనించాలి.

| తేదీ | సెలవు | రోజు |
| ఏప్రిల్ 4 | మహావీర్ జయంతి | మంగళవారం |
| ఏప్రిల్ 7 | గుడ్ ఫ్రైడే | శుక్రవారం |
| ఏప్రిల్ 14 | అంబేద్కర్ జయంతి | శుక్రవారం |
| మే 1 | మహారాష్ట్ర దినోత్సవం | సోమవారం |
| జూన్ 28 | బక్రీద్ | బుధవారం |
| ఆగస్టు 15 | స్వాతంత్య్ర దినోత్సవం | మంగళవారం |
| సెప్టెంబర్ 19 | గణేష్ చతుర్థి | మంగళవారం |
| అక్టోబర్ 2 | గాంధీ జయంతి | సోమవారం |
| అక్టోబర్ 24 | దసరా | మంగళవారం |
| నవంబర్ 14 | దీపావళి | మంగళవారం |
| నవంబర్ 27 | గురునానక్ జయంతి | సోమవారం |
| డిసెంబర్ 25 | క్రిస్మస్ పండుగ | సోమవారం |
ఈ వారం స్టాక్ మార్కెట్లు చాలా ఓలటాలిటీని ఎదుర్కోనున్నాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభానికి ముందుగానే OPEC+ దేశాలు తమ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించటంతో ఆ ఒత్తిడి కనిపించింది. ఇప్పటికే ఉన్న ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, వడ్డీ రేట్ల పెంపు వల్ల కొనసాగుతున్న ఆందోళనలకు ఈ నిర్ణయం ఆజ్యం పోసింది.
దీనికి తోడు రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వడ్డీ రేట్ల పెంపు ప్రకటన ఉంటుందా..? లేక ఈ సారికి రేట్ల పెంపును సభ్యులు వాయిదా వేస్తారా..? అనే ప్రకటన కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు ఈ వారం పెట్టుబడులు ప్రయాణం కొంత కత్తిమీద సాములాంటిదేనని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications