Trading updates: మారుతున్న కాలానికి అనుగుణంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అందుకు తగిన విధంగా సెబీ సహా ఎక్స్ఛేంజీలు పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కీలక డెసిషన్ తీసుకుంది.
మార్చి 2న ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రకటించింది. మార్కెట్ మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడం మరియు బలోపేతం చేయడం లక్ష్యంగా దీనిని చేపడుతున్నట్లు పేర్కొంది. మొదటి ట్రేడింగ్ సెషన్ ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు, రెండవ సెషన్ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది.

'ఈక్విటీ మరియు ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలో మార్చి 02, 2024 శనివారం నాడు ట్రేడింగ్ జరపబడుతుంది. ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ (DR) సైట్‌కి ఎక్స్ఛేంజ్ ఇంట్రా-డే స్విచ్ ఓవర్‌తో ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాం. సభ్యులందరూ దీనిని గమనించవలసిందిగా కోరుతున్నాం' అని NSE తన సర్క్యులర్‌లో పేర్కొంది.
అన్ని సెక్యూరిటీలు (అందుబాటులోని డెరివేటివ్స్ తో సహా) గరిష్ఠంగా 5 శాతం బ్యాండ్‌ను కలిగి ఉంటాయని ఎక్స్ఛేంజ్ తెలిపింది. క్లోజ్-ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ 5 శాతం ధర బ్యాండ్‌ను కలిగి ఉండగా, అన్ని ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 5 శాతం రోజువారీ నిర్వహణ పరిధితో పనిచేస్తాయని వెల్లడించింది. ఆ రోజున సెక్యూరిటీలు లేదా ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ఫ్లెక్సింగ్ వర్తించదని స్పష్టం చేసింది.
జనవరి 20న NSE మరియు BSE ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ప్రకటించాయి. అయితే రెండు రోజుల తర్వాత రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు దినంగా ప్రకటించబడటంతో అది కాస్తా పూర్తి ట్రేడింగ్ సెషన్‌గా మారింది. ఏదైనా ఊహించని సంఘటనను ఎదురైతే మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థల (MIIలు) సంసిద్ధతను అంచనా వేయడం ఈ సెషన్ ఉద్దేశమని NSE తెలిపింది. నిర్ణీత వ్యవధిలోగా DR సైట్ నుండి కార్యకలాపాలను పునరుద్ధరించడం లక్ష్యంగా పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications