NSE Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ఐపీవోలకు మించిన కార్పొరేట్ ఫలితాల కోలాహలం కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు ఈ క్రమంలో బోనస్ డివిడెండ్ ప్రకటనతో ఇన్వెస్టర్లను లాభాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తాజాగా మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కంపెనీ తన ఇన్వెస్టర్లకు వరుస శుభవార్తలు ప్రకటించింది. ముందుగా పెట్టుబడిదారులకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఒక్కో షేరుకు 4 బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించినట్లు బోర్డు శుక్రవారం ప్రకటించింది. దీనికి తోడు ఒక్కో షేరుపై అర్హతకలిగిన ఇన్వెస్టర్లకు రూ.90 ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. ఇది మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రతి షేరు ముఖ విలువపై 9000% డివిడెండ్ అందించటాన్ని ఇన్వెస్టర్లు కోలాహలంలో నింపేసింది.

అయితే డివిడెండ్ చెల్లింపు రాబోయే ఏజీఎంలో ఇన్వెస్టర్ల నుంచి అనుమతి పొందటంపై ఆదారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. AGM నుంచి 30 రోజులలోపు అర్హత కలిగిన వాటాదారులకు డివిడెండ్ చెల్లించబడుతుంది. ఇదే క్రమంలో ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. మార్చితో ముగిసిన క్యూ4లో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.2,478 కోట్లుగా నమోదైంది. అలాగే ఈ కాలంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆదాయం 34 శాతం పెరిగి రూ.4,625 కోట్లకు చేరుకుంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయాలను పరిశీలిస్తే.. ఎన్‌ఎస్‌ఈ లాభం 13 శాతం పెరిగి రూ.8,306 కోట్లకు చేరుకోగా.. ఆదాయం 25 శాతం పెరిగి రూ.14,780 కోట్లకు చేరుకుంది.
ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్ఈ ఆదాయం ఏడాదికి 25% పెరిగి రూ.14,780 కోట్లకు చేరుకుంది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, సెబీ ఫీజుల ద్వారా ఖజానాకు రూ.43,514 కోట్లు జమ అయినట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది.


Click it and Unblock the Notifications