వచ్చే నెలలో మరో పెద్ద ఐపిఒ..లాభాలు వచ్చే ఛాన్స్.. ఇన్వెస్టర్లు గెట్ రెడీ..
NSDL IPO: గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం చూస్తోంది. రోజురోజుకి దిగజారుతున్న షేర్ మార్కెట్ పరిస్థితుల కారణంగా ప్రైమరీ మార్కెట్లో మందగమనం నెలకొంది. ఈ కాలంలో పెద్ద కంపెనీల ఐపిఒ కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఈ కరువు ముగియబోతోంది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) IPO త్వరలో స్టాక్ మార్కెట్‌ను తాకబోతోంది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం దేశంలోనే అతిపెద్ద సెక్యూరిటీ డిపాజిటరీ NSDL IPO వచ్చే నెలలో అంటే ఏప్రిల్ ప్రారంభంలో రావచ్చు. ఈ IPO సైజ్ రూ. 3000 కోట్లుగా ప్రతిపాదించింది. గత 3 వారాల్లో ఏ పెద్ద కంపెనీ కూడా లిస్టింగ్ కాలేదనే వాస్తవం ద్వారా ప్రైమరీ మార్కెట్ పరిస్థితి ఎంతవరకు మారిందో అంచనా వేయవచ్చు. అయితే ఈ సంవత్సరం LG ఇండియా, టాటా క్యాపిటల్ వంటి పెద్ద కంపెనీల IPOలు ఆశించవచ్చు.
NSDL IPO పూర్తిగా కొత్త ఇష్యూపై ఆధారపడి ఉండవచ్చు. కంపెనీలో ప్రస్తుతం ఉన్న 6 మంది ప్రమోటర్లు వారి వాటాను తగ్గించుకోవచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, IDBI బ్యాంక్, HDFC బ్యాంక్‌లకు NSDLలో వాటా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఒక్కటే 24 శాతం వాటాతో ఉంది. మా ఐపిఒ వేటింగ్ టైం వచ్చే నెలతో ముగుస్తుందని NSDL తెలిపింది. మేము వేగంగా అన్ని పనులను పరిష్కరిస్తున్నాము. ఇంకా SEBI నియమాలు కూడా పరిగణలోకి తీసుకొని NSDL IPO పనులలో వేగం చేస్తున్నాం. ఈ కారణంగా కూడా కంపెనీపై ఒత్తిడి ఉంది.

కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.85.80 కోట్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన NSDL నికర లాభం 29.82 శాతం పెరిగింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కంపెనీ ఆదాయం 16.2 శాతం పెరిగి రూ.391.21 కోట్లకు చేరుకుంది.
స్టార్ట్ మార్కెట్లో IPOను తీసుకొచ్చే ముందు ముసాయిదాను సిద్ధం చేయడానికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ నుండి రెగ్యూలేటరీ ఆమోదాలు అవసరం. వీటిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం కీలకం. అయితే ఈ కంపెనీకి ఆమోదం పొందడంలో ఇంకా కొంత ఆలస్యం జరుగుతుందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కంపెనీ IPO మార్చి నాటికి పూర్తవుతుందని, ఈ నెలాఖరులోపు IPOను మార్కెట్‌కు ప్రతిపాదించనున్నట్లు అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications