Hyderabad: గడచిన కొన్నేళ్లుగా హైదరాబాద్ విశ్వనగరంగా గుర్తింపును తెచ్చుకుంది. ఐటీ సేవల రంగానికి ఇక్కడ మంచి పట్టు ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి యువత ఉపాధి కోసం నగరానికి వలస రావటం నగరంలో రద్దీని పెంచేస్తోంది.
దీంతో హైదరాబాద్ రియల్టీ వేగంగా పుంజుకుంటోంది. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా ఇతర నగరాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు ప్రస్తుతం విదేశాల్లో నివశిస్తున్న ఎన్నారైలు కూడా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ సంస్కృతి, శాంతిభద్రతలతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. డాలర్లను తిరిగి దేశంలోకి తీసుకొస్తూ వేగంగా వృద్ధి చెందుతున్న నగరంలో ఎక్కువగా ప్రాపర్టీలు కొనేస్తున్నారు.

భారతదేశానికి తిరిగి వచ్చి స్థిరపడాలని భావిస్తున్న చాలా మంది ఎన్నారైలు హైదరాబాద్‌లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ వంటి ఖరీదైన నగరాల్లో నివశిస్తున్న ఎన్నారైలు ఎక్కువగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. నగరంలోని శంషాబాద్, పటాన్‌చెరు, గండిమైసమ్మ తదితర ప్రాంతాల్లో వెంచర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారని డీఈవీ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ బన్సాల్ వెల్లడించారు.
ప్రధానంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, స్వగ్రామాలకు దూరంగా ఉండడంతో నాణ్యమైన విద్య, రవాణా తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ నగరాలకు చెందిన ఐటీ ఉద్యోగులు నగరంలో ఫ్లాట్లు కొంటున్నారు. దీనికి తోడు బీహార్, అహ్మదాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, ఇతర కమ్యూనిటీ ప్రజలు హైదరాబాదులో ఆస్తులు కొంటున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ సభ్యులు తెలిపారు. నగరంలో ఉద్యోగులు, వ్యాపారులు.. ఫ్లాట్లు, ఇతర ప్రాపర్టీలు కొనుగోలు చేయటం ఏటా 3-4 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని చెబుతున్నారు.
నీటి కొరత లేకపోవటం దీనికి ఒక కారణంగా రియల్టీ బిల్డర్లు చెబుతున్నారు. బెంగళూరులో నీటి కనెక్షన్ పొందాలంటే 2-3 ఏళ్లు పడుతోందని.. కానీ హైదరాబాదులో రెండు నెలల్లోనే ఇది పూర్తవుతుందని వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లో వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అనే తేడా లేకుండా ఏ ప్రాంతంలోనైనా నీరు పుష్కలంగా అందుబాటులో ఉండగా కేవలం రెండు నెలల్లోనే వాటర్ బోర్డు కనెక్షన్లు అందించటం ఇన్వెస్టర్లను నగరం ఆకర్షిస్తోంది.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

వైజాగ్ రియల్ ఎస్టేట్.. ఈ నాలుగు జోన్లలోని ఫ్లాట్ల కోసం ఎగబడుతున్న కొనుగోలుదారులు..కారణం ఏంటంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications