NRI News: గత కొద్ది కాలంగా భారతీయ విద్యార్థులు విదేశాలకు తమ చదువుల కోసం అక్కడి యూనివర్సిటీలకు పయనిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పై చదువుల కోసం చాలా డబ్బు వెచ్చిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా అమెరికాకు వెళ్లిన భారతీయులు.. వీసా పొందటం కష్టతరంగా మారుతున్న వేళ యూకే, కెనడా వంటి దేశాల్లోని యూనివర్సిటీలను ఎంచుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వారికి ఇప్పుడు గమనించాల్సిన కీలకమైన నిబంధనల మార్పులు ఉన్నాయి.
చాలా మంది యువత బ్రిటన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందాలనుకుంటున్నా లేక యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వార్త వారికోసమే. నూతన సంవత్సరం నుంచి స్టూడెంట్ అండ్ జాబ్ వీసాల విషయంలో యూకే నెలవారీ నిర్వహణ ఖర్చును పెంచింది. దీని కారణంగా జనవరి 2025 నుంచి అక్కడికి వెళ్లేవారు గతంలో కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఇండియా నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు చదువుకోవాలని లేదా వలస వెళ్లాలని ప్లాన్ చేసుకునే వ్యక్తులు ప్రస్తుత అవసరాల కంటే కనీసం 11 శాతం ఎక్కువ ఆర్థిక నిల్వలను చూపించాల్సి ఉంటుంది. హౌసింగ్ అండ్ ఆర్థిక వ్యవస్థపై ఇమ్మిగ్రేషన్ ప్రభావం గురించి ఆందోళనలకు ప్రతిస్పందనగా స్టడీ, వర్క్ వీసా దరఖాస్తుదారులకు ఆర్థిక పరిమితులను పెంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించటంతో ఈ మార్పులు వచ్చాయి.

ముందుగా ఇండియా నుంచి యూకే వెళ్లే విద్యార్థుల విషయంలో వచ్చిన ఆర్థికపరమైన మార్పులను పరిశీలిస్తే.. జనవరి 2, 2025 నుంచి యూకే స్టడీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థులు జీవన వ్యయాలను కవర్ చేయడానికి తగినన్ని నిధులకు సంబంధించిన సాక్ష్యాలను చూపాలి. లండన్‌లోని కోర్సులకు నెలకు 1,483 యూరోలు, లండన్ బయట కోర్సులకు నెలకు 1136 యూరోలు ఇందుకు అవసరం. ఒక సంవత్సరం మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం లండన్ లో 13,347 యూరోలు, లండన్ బయట 10,224 యూరోలు తొమ్మిది నెలల ఖర్చులను కవర్ చేస్తుంది. విద్యార్థులు వీసా దరఖాస్తును సమర్పించడానికి ముందు కనీసం 28 రోజుల పాటు ఈ నిధులు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలో చూపాల్సి ఉంటుంది. ఇప్పటికే యూకేలో నివసిస్తున్న విద్యార్థులు లేదా కొన్ని దేశాలకు చెందిన విద్యార్థులు ఈ నవీకరించబడిన అవసరాల నుంచి మినహాయించబడ్డారు.
నైపుణ్యం కలిగిన వర్కర్ వీసా కోసం మెుదటిసారి దరఖాస్తు చేసే వ్యక్తులు జీవన వ్యయాలు, వసతి అవసరాల కోసం కనీసం 38,700 యూరోల ఆదాయాన్ని ప్రదర్శించాలి. వీసా కోసం దరఖాస్తు చేయడానికి 28 రోజుల ముందు అవసరమైన నిధులను కలిగి ఉన్నారని చూపించవలసి ఉంటుంది. ఇకపోతే పర్యాటక, కుటుంబం, జీవిత భాగస్వామి, చైల్డ్, విద్యార్థి వీసాలతో సహా వివిధ వర్గాలలో వీసా దరఖాస్తు రుసుము స్వల్పంగా పెంపులను చూశాయి.
అయితే వికలాంగులు, సంరక్షకులు, ఆరోగ్య సంరక్షణ, సాయుధ దళాలు, నిర్దిష్ట ప్రతిభ ఆధారిత పాత్రలు వంటి నిర్దిష్ట రంగాలలో పనిచేస్తున్న వారికి మాత్రం పెంపు నుంచి మినహాయింపులు ఉంటాయనే యూకే వెల్లడించింది. ఈ క్రమంలో యూకే ప్రస్తుతం వీసా దరఖాస్తుకు 28 రోజల ముందు నుంచి అవసరమైన నిధులను తమ ఖాతాలో ఉంచే కొత్త నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో వీసా దరఖాస్తు తేదీ నుంచి 28 రోజుల వ్యవధి ముగింపు బ్యాలెన్స్ నుండి వెనుకకు లెక్కించబడుతుందని అందరూ గుర్తుంచుకోవాలి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications