NPS Rules Change: జనవరి 1 నుంచి ఎన్పీఎస్ రూల్స్ మారిపోతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) చందాదారుల కోసం పాక్షిక ఉపసంహరణ నియమాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటే PFRDA కొత్త ఉత్తర్వును జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం.. అన్ని ప్రభుత్వ రంగాలకు చెందిన కస్టమర్‌లు అంటే సెంట్రల్, స్టేట్, సెంట్రల్ అటానమస్ బాడీలు ఇప్పుడు పాక్షిక ఉపసంహరణ కోసం దరఖాస్తును తమ నోడల్ అధికారికి మాత్రమే సమర్పించాలి.

కరోనా సమయంలో.
జనవరి 2021లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కరోనా మహమ్మారి నేపథ్యంలో స్వీయ-డిక్లరేషన్ ద్వారా NPS సభ్యుల నుంచి పాక్షిక ఉపసంహరణ కోసం ఆన్‌లైన్ అభ్యర్థనలను అనుమతించింది. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రత్యేక సడలింపుగా వినియోగదారులకు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడుతున్నాయని అప్పట్లో ప్రకటించింది.

పీఎఫ్‌ఆర్‌డీఏ సర్క్యులర్..
పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ దీనికి సంబంధించి డిసెంబర్ 23, 2022లో సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రభుత్వ రంగ కస్టమర్లందరూ NPS నుండి పాక్షిక ఉపసంహరణ కోసం తమ అభ్యర్థనను సంబంధిత నోడల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

NPS పాక్షిక ఉపసంహరణకు నియమాలు..
- కనీసం 3 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి
- కస్టమర్ల మొత్తం సహకారం నుంచి 25% ఉపసంహరించుకోవచ్చు
- సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో 3 సార్లు ఉపసంహరణ అనుంతించబడుతుంది
- కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల పాక్షిక ఉపసంహరణ సాధ్యమవుతుంది

అవసరమైన పత్రాలు..
నేషనల్ పెన్షన్ పథకం నుంచి ఎవరైనా డబ్బును ఉపసంహరించుకోవాలంటే ఈ కింది పత్రాలు తప్పనిసరి.
* పాన్ కార్డ్ ఫోటో కాపీ
* క్యాన్సిల్డ్ చెక్
* గుర్తింపు కార్డు
* ఆధార్ కార్డ్
* రేషన్ కార్డ్
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications