ఎన్‌పిఎస్ వాత్సల్య స్కింపై నిర్మలమ్మ చల్లని వార్త.. ఇప్పుడు మీరు కూడా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 ప్రసంగంలో ఎన్‌పిఎస్ వాత్సల్య కస్టమర్లు ఇప్పుడు సెక్షన్ 80సిసిడి(1బి) కింద సాధారణ ఎన్‌పిఎస్ కస్టమర్లతో సమానమైన పన్ను ప్రయోజనాలను పొందుతారని ప్రకటించారు. అయితే కొత్త పన్ను విధానంలో ఈ ప్రయోజనం ఉండదని గమనించాలి. NPS పథకం కింద పదవీ విరమణ, డిపెండెంట్ సెక్యూరిటీ కోసం సేవింగ్స్ ప్రోత్సహిస్తుంది. బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదిందానికి లోబడి ఉంటాయి.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ( PFRDA ) అనేది ఈ స్కీమ్‌ను పర్యవేక్షిస్తూ, పారదర్శకత అలాగే పెట్టుబడుల సురక్షిత నిర్వహణకు భరోసా ఇచ్చే రెగ్యూలేటరీ సంస్థ. ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ 2025లో "ఆదాయ-పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80CCDలోని సబ్-సెక్షన్ (1B) కింద నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)కి ఉన్న పన్ను ప్రయోజనాలు NPS వాత్సల్య అకౌంట్లకు కూడా వర్తిస్తాయి. ట్యాక్స్ కట్టే NPS వాత్సల్య స్కిం ( పిల్లలు, ఆధారపడినవారు లేదా అర్హులైన లబ్ధిదారుల కోసం) కస్టమర్లు సెక్షన్ 80CCD(1B) కింద సాధారణ NPS కోసం మినహాయింపులాగానే అదనంగా రూ. 50,000 పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయడానికి అర్హులు,

NPS వాత్సల్య అంటే ఏమిటి?
NPS వాత్సల్య భారతదేశంలోని మైనర్ పిల్లల పెన్షన్ పథకం. ఈ స్కిం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ఒక భాగం. చిన్న వయస్సు నుండే రిటైర్మెంట్ కోసం పిల్లలకు సేవింగ్స్ చేసే అలవాటును పెంపొందించడానికి ఈ పథకం రూపొందించబడింది.
NPS వాత్సల్య లక్షణాలు
*తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి పిల్లల కోసం NPS అకౌంట్ తెరవవచ్చు
*కనీస సేవింగ్స్ సంవత్సరానికి రూ. 1,000 నుండి గరిష్ట సహకారంపై పరిమితి లేదు
*పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని నియంత్రిస్తుంది అలాగే నిర్వహిస్తుంది
* ఈ స్కిం కోసం eNPS ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్ చేయవచ్చు.
*పిల్లలు లాంగ్ టర్మ్ ఆర్థిక భద్రత కోసం సహాయపడటం ఈ పథకం లక్ష్యం
మెజారిటీ చేరుకున్న తర్వాత ఎగ్జిట్ అప్షన్స్ ఏమిటి
మీ పిల్లలకి 18 సంవత్సరాలు నిండినప్పుడు సాధారణ NPS అకౌంట్ మార్చడానికి బదులుగా స్కీమ్ నుండి ఎగ్జిట్ కావడానికి అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications