పెన్షన్ రెగ్యులేటర్ PFRDA(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ) నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS) పథకంలో చేరిన సబ్‌స్క్రైబర్లకు ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగుసార్లు తమ పెట్టుబడి విధానాన్ని మార్చుకోవడానికి త్వరలో అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు PFRDA చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ తెలిపారు. పరిశ్రమ సమాఖ్య అసోచామ్ ఎన్పీఎస్ పథకంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్లు తమ పెట్టుబడి విధానాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు మార్చుకునే వెసులుబాటు ఉంది. దీనిని నాలుగుకు పెంచనున్నారు.
సబ్‌స్క్రైబర్లు తమ పెట్టుబడి విధానాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో 2సార్లు మాత్రమే మార్చుకునేందుకు వీలుందని, స్వల్ప వ్యవధిలో దీనిని నాలుగు సార్లకు పెంచబోతున్నామని, పెట్టుబడి విధానాన్ని మార్చేందుకు అవకాశాలు పెంచాలని ఇటీవల అభ్యర్థనలు బాగా వస్తున్నాయని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ సెక్యూరిటీస్, డెట్ సాధనాలు, అసెట్-బ్యాక్డ్, ట్రస్ట్-స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్వల్ప కాలిక రుణ సాధనాలు, ఈక్విటీల్లో తమ పెట్టుబడుల కేటాయింపును మార్చుకొనేందుకు వీలుంటుంది.

వివిధ సబ్‌స్క్రైబర్లకు వేర్వేరుగా నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈక్విటీల్లో ఎక్కువ కేటాయింపును ఎంచుకొనే వీలుండదు. అదే కార్పొరేట్ రంగంలో పని చేస్తున్న వారు 75 శాతం పెట్టుబడిని ఈక్విటీలకు కేటాయించవచ్చు. అలాగే తమ ఫండ్ మేనేజర్లను ఏడాదికి ఒకసారి మార్చుకునే వెసులుబాటు ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications