భారతదేశంలో పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం చాలామంది ఎంచుకునే మార్గం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). అయితే సాధారణంగా NPS లో జమ అయిన డబ్బులో కొంత భాగాన్ని తప్పనిసరిగా పెన్షన్ పథకం (Annuity) కోసం ఉంచాలి అనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కీలక మార్పులు చేసింది. ఈ కొత్త సవరణల ప్రకారం నిర్దిష్ట పరిమితిలోపు కార్పస్ ఉన్నవారు తమ సొమ్మును 100% విత్‌డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.

రూ. 5 లక్షల నుండి రూ. 8 లక్షలకు పెంపు
తాజా నిబంధనల ప్రకారం ప్రభుత్వ , ప్రైవేట్ రంగాలకు చెందిన NPS సబ్‌స్క్రైబర్లు 60 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు (రిటైర్మెంట్ సమయంలో), వారి ఖాతాలో మొత్తం సొమ్ము రూ. 8 లక్షల కంటే తక్కువ ఉంటే.. దానిని పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు మీ ఖాతాలో రూ. 8 లక్షల వరకు ఉన్నా, మీరు దానిని నెలవారీ పెన్షన్ స్కీమ్ కోసం కాకుండా.. ఒకేసారి లంప్ సమ్ రూపంలో విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చే విషయం.
60 ఏళ్ల కంటే ముందే విత్ డ్రా చేయాలంటే?
ఒకవేళ మీరు 60 ఏళ్లు నిండకముందే NPS నుండి వైదొలగాలని (Premature Exit) భావిస్తే, దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి.
- మీరు ఈ పథకంలో కనీసం 5 ఏళ్లు సభ్యులుగా ఉండాలి.
- మీ మొత్తం కార్పస్ విలువ రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటేనే 100% విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఒకవేళ రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, కేవలం 20% మాత్రమే లంప్ సమ్‌గా లభిస్తుంది. మిగిలిన 80% ని తప్పనిసరిగా పెన్షన్ ప్లాన్ (Annuity) కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి.
అకాల మరణం సంభవిస్తే పరిస్థితి ఏమిటి?
చందాదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ ఖాతాలో ఎంత సొమ్ము ఉన్నా సరే, దానిని నామినీ లేదా వారసులకు 100% చెల్లిస్తారు. దీనికి ఎటువంటి పరిమితులు ఉండవు. ఒకేసారి మొత్తం మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వారికి పూర్తి హక్కు ఉంటుంది.
రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి?
ఒకవేళ మీ రిటైర్మెంట్ నాటికి కార్పస్ రూ. 8 లక్షలు దాటితే.. నాన్-గవర్నమెంట్ సబ్‌స్క్రైబర్లు కనీసం 20% మొత్తాన్ని యాన్యుటీ (పెన్షన్) కోసం కేటాయించి, 80% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, ఇందులో 60% పై మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే, కార్పస్ రూ.8 లక్షలు దాటితే కనీసం 40% మొత్తాన్ని తప్పనిసరిగా పెన్షన్ కోసం ఉంచాలి, మిగిలిన 60% తీసుకోవచ్చు.
ఈ కొత్త మార్పుల వల్ల చిన్న మొత్తంలో పొదుపు చేసుకునే మధ్యతరగతి ప్రజలకు రిటైర్మెంట్ సమయంలో చేతికి ఎక్కువ నగదు అందే అవకాశం ఉంటుంది. మీ NPS ఖాతాను ఒకసారి తనిఖీ చేసుకుని, ఈ కొత్త నిబంధనల ప్రకారం మీ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications