NPS Account: ఎన్ పీఎస్ అకౌంట్ ఫోన్ లో తెరవచ్చు.. ఎలాగంటే..
వృద్ధప్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. మంచి రాబడి వచ్చే పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఇలాంటి పెట్టుబడి పథకాల్లో ఎన్ పీఎస్ ఒకటి. ఎన్ పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీం. దీనిని PFRDA నిర్వహిస్తోంది. అయితే ఎన్ పీఎస్ అకౌంట్ తెరవాలంటే పత్రాలు అవసరమయ్యేవి..

ఎన్ పీఎస్ అకౌంట్
అయితే తాజా వినియోగదారులు సింపుల్ గా ఎన్ పీఎస్ అకౌంట్ ఫోన్ లో తెరుచుకునే సౌకర్యం తీసుకొచ్చారు. ఫోన్ లో ఎన్ పీఎస్ ఖాతా తెరిచేందుకు డిజిటల్ ప్లాట్‌ఫాంను పింఛను నిధి నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏతో కలిసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఇందుకోసం కె-ఫిన్‌టెక్ సహకారాన్ని తీసుకున్నారు. అకౌంట్ తీసుకోవాలనుకునే వారు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఎటువంటి కాగితాలతో సంబంధం లేకుండా తెరవవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది.

డిజిటల్ ప్లాట్‌ఫాం
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ ఎ.కె. దాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వరూప్ దాస్‌గుప్తాల సమక్షంలో ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంను పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్ సుప్రతిమ్ బంధ్యోపాధ్యాయ్ ప్రారంభించారు. 'క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఎన్‌పీఎస్ ఖాతా తెరిచే వెబ్‌పేజ్‌కు వెళ్లొచ్చు. ఫొటో, ఇతర వివరాలను డిజిలాకర్ నుంచి పొందడం కోసం అక్కడ ఆధార్ నంబరును నమోదు చేయాలి.

సరళంగా, వేగంగా..
ఈ ఖాతా తెరచే ప్రక్రియ సరళంగా, వేగంగా, పూర్తిగా కాగితరహితంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్ పీఎస్ లో టైర్-1, టైర్ -2 అకౌంట్ ఉంటుంది. టైర్-1 అకౌంట్ తీసిన వారే టైర్-2 అకౌంట్ తెరవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications