New feature in UPI: సాంకేతికత పరంగా దూసుకుపోతున్న భారత్‌లో కొత్త టెక్నాలజీని ప్రజలకు చేరువ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యూపీఐ ద్వారా క్షణాల వ్యవధిలో పేమెంట్స్ జరిపే సిస్టం రూపొందించింది. అదికాస్తా దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. ఇదే సమయంలో దానిని మరింత ఆధునీకరించేందుకు ఎప్పటికప్పుడు శ్రమిస్తోంది. తాజాగా మరో అద్భుతాన్ని UPIకు జోడించనున్నట్లు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇప్పటివరకు బ్యాంకు ఖాతా ఉన్నవారు ఎవరి UPI వారు మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంది. దీనిని మరో లెవల్ కి తీసుకెళ్లేందుకు NPCI ప్లాన్ రెడీ చేసింది. UPI సర్కిల్ పేరుతో కొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ సౌకర్యం వల్ల కలిగే బెనిఫిట్స్ వివరాలు వెల్లడించింది. ఇది అందుబాటులోకి వస్తే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది.

ఈ విధానంలో ఎవరైనా బయటికి వెళ్లి పేమెంట్ చేయాల్సి వస్తే తమకు అనుమతించిన కుటుంబ సభ్యులు లేదా ఇతరుల UPI ద్వారా చెల్లించేయవచ్చు. అంటే ఓకే బ్యాంక్ అకౌంట్ ఉపయోగించి పలువురు వ్యక్తులు లావాదేవీలు జరపవచ్చు. కాలేజీలు, స్కూళ్లు, సూపర్ మార్కెట్లు వంటి వివిధ ప్రాంతాల్లో ఎంచక్కగా ఈ ఫీచర్ ని వాడేయవచ్చు. తద్వారా ఇప్పటికీ బ్యాంకు ఖాతా లేకుండా నగదు ఆధారిత లావాదేవీలు జరుగుతున్న వారికి UPIని పరిచయం చేయడంలో భాగంగా ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మోసపూరిత లావాదేవీల నియంత్రణకుగాను కొన్ని పరిమితులను సైతం NPCI విధించింది. ఒక ప్రైమరీ యూజర్ ఐదుగురికి మాత్రమే తన UPI ఖాతాను వినియోగించుకునేందుకు అనుమతించగలరు. అంతే కాకుండా నెలకు 15 వేలు మాత్రమే ఈ విధానంలో చెల్లింపులు చేయవచ్చు. ప్రైమరీ యూజర్ పూర్తిస్థాయి అనుమతితో సెకండరీ వినియోగదారుడు నిరంతరాయంగా ఖర్చు చేయవచ్చు. అయితే పాక్షికంగా అనుమతి ఇస్తే ప్రతి లావాదేవీని ప్రైమరీ యూజర్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications