UPI News: ప్రస్తుతం దేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను చాలా విరివిగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం మార్చుతోంది. ఇది యూజర్ల రక్షణలో భాగమైనప్పటికీ తెలుసుకోకపోతే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
వాస్తవానికి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, క్రెడ్ పే, వాట్సాప్ పే వంటి ప్రైవేటు కంపెనీల చెల్లింపు ఉత్పత్తులను ప్రజలు చాలా విరివిగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది నుంచి వినియోగించని యూపీఐ ఐడీలను నిరుపయోగం చేయాలని తాజాగా నిర్ణయించటం జరిగింది. అలాంటి యూపీఐ ఐడీలను డిసెంబర్ 31లోగా మూసివేయాలని సదరు కంపెనీలకు NPCI నుంచి కొత్త మార్గదర్శకాలు అందాయి.

ఈ లెక్కన ఎవరైనా యూపీఐ వినియోగదారుడు తన చెల్లింపు యాప్ ద్వారా కనీసం ఒక్క ట్రాన్సాక్షన్ చేసి డబ్బును బదిలీ చేస్తే మీరు ప్రస్తుత యూపీఐ ఐడీని యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. పేమెంట్ యాప్స్ రెగ్యులర్ గా వినియోగించే యూపీఐ యూజర్లు ఈ నిబంధనల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని తర్వాత తాజాగా కొత్త యూపీఐ యూజర్లు మెుదటి సారి పేమెంట్స్ చేసేందుకు లిమిట్స్ పై కూడా కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెడుతున్నారు
యూపీఐ విషయంలో దేశంలో అనేక మోసాలు జరుగుతున్నట్లు నిరంతరం ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తాజా చర్యలు వచ్చాయి. వ్యక్తులు తమ మొబైల్ నంబర్‌ను మార్చుకుంటున్నప్పటికీ వారి యూపీఐ అప్‌డేట్ చేయకపోవటం వల్ల అనేక మోసాలు జరుగుతున్నట్లు NPCIకి వస్తున్న ఫిర్యాదుల ద్వారా గ్రహించింది. టెలికాం రూల్స్ ప్రకారం పాత నంబర్ వేరొకరికి కేటాయించబడినప్పుడు వేరొకరికి సొమ్ము చేరుతున్నట్లు గుర్తించబడింది. అదుకే వినియోగదారుల భద్రత, వారి డబ్బు దుర్వినియోగం కాకుండా ఉండాలనే లక్ష్యంతో తాజా నిబంధనలను అమలులోకి తీసుకొచ్చినట్లు NPCI వెల్లడించింది.


Click it and Unblock the Notifications