Net Banking 2.0: నెట్ బ్యాంకింగ్‌లో కొత్త మార్పులు! ఇకపై ఎలా ఉంటుందంటే..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క విభాగమైన NPCI Bharat BillPay.. ఆన్‌లైన్ చెల్లింపులను వినియోగదారులకు మరింత సరళంగా, సురక్షితంగా మార్చేందుకు ఉద్దేశించిన సరికొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. ఇదెలా ఉంటుందంటే..

నెట్ బ్యాకింగ్ లో (Net Banking)లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. NPCI భారత్ బిల్‌పే.. రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో నెలవారీ లావాదేవీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 260 మిలియన్ల నుండి 1 బిలియన్ (100 కోట్లు)కు పెంచాలని, దేశంలోని సగం కుటుంబాలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ప్రతి కుటుంబం నుండి సుమారు మూడు బిల్లుల లావాదేవీలు ప్రాసెస్ చేయాలని భావిస్తున్నట్లు NPCI Bharat BillPay మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నూపుర్ చతుర్వేది వెల్లడించారు.
బ్యాంకిగ్ కనెక్ట్ (Banking Connect)
NPCI భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)కి Banking Connect అనే కొత్త పేరుని ప్రకటించింది. ఇది డిజిటల్ బిల్ చెల్లింపుల కోసం తయారుచేసిన ఒక ఏకీకృత వ్యవస్థ. ఈ కొత్త వ్యవస్థను గత నెలలో గ్లోబల్ ఫిన్‌టెక్ సమ్మిట్‌లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రారంభించారు. కొత్తగా మార్చిన ఈ విధానం.. ఆన్‌లైన్ చెల్లింపులను మరింత ఈజీగా, సేఫ్ గా ఉంచుతుంది.
మార్పులు ఇవే..
ప్రస్తుతం ఉన్న నెట్ బ్యాంకింగ్ విధానంలో.. వినియోగదారులు తరచుగా ఒక వెబ్‌పేజీకి మళ్లించబడతారు. అక్కడ వారు ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. చాలామంది వాటిని మర్చిపోవడం వలన చెల్లింపు మధ్యలోనే ఆగిపోతుంది. ఈ ఇబ్బందిని కొత్త వ్యవస్థ తొలగిస్తుంది.
- బ్యాంకింగ్ యాప్‌లకు రీడైరెక్ట్: కొత్త వ్యవస్థ వినియోగదారులను నేరుగా వారి సొంత బ్యాంకింగ్ యాప్‌లకు మళ్లిస్తుంది. దీంతో వినియోగదారులు సుపరిచితమైన యాప్‌లో సులభంగా, భద్రతతో లావాదేవీని పూర్తి చేయవచ్చు.
- QR కోడ్ చెల్లింపు: ఈ ప్లాట్‌ఫారమ్ లావాదేవీ సమయంలో డైనమిక్ QR కోడ్‌ను రూపొందించే ఎంపికను కూడా జోడించింది. వినియోగదారులు తమ బ్యాంక్ యాప్‌ను ఉపయోగించి దాన్ని స్కాన్ చేసి చెల్లింపును పూర్తి చేయవచ్చు.
- మొబైల్-ఫస్ట్ విధానం: పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ మొత్తం వ్యవస్థ 'మొబైల్-ఫస్ట్' విధానంతో నిర్మించబడింది.
- AI & ML సేఫ్టీ: ఆన్ లైన్ మోసాలను గుర్తించడానికి, బ్యాంకుకు మెసేజ్ పంపడానికి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ML (మెషీన్ లెర్నింగ్) వంటి కొత్త సాంకేతికతలను ఉపయోగించి ఈ వ్యవస్థలో ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ పొందుపరచబడింది.
- ఇప్పటికే అమలు: NPCI Bharat BillPay ప్రకారం, ప్రస్తుతం HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు.. అలాగే PayU, Razorpay, Cashfree వంటి అనేక చెల్లింపు అగ్రిగేటర్‌లు ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి.
లాభాలు ఇవే..
ఇకపై నెట్ బ్యాంకిగ్ యూజర్లకు మూడు చెల్లింపు మార్గాలు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ యాప్‌ను ఉపయోగించడం, QR కోడ్‌ను స్కాన్ చేయడం లేదా వారి బ్యాంక్ ఇంకా మారనట్లయితే ప్రస్తుత నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను కొనసాగించడం. ఈ కొత్త Net Banking 2.0 ముఖ్య లక్ష్యం పారదర్శకత (Transparency) అని బిల్‌పే సీఈవో చెప్తున్నారు. ఈ కొత్త విధానంలో ఫిర్యాదులు, ఛార్జ్‌బ్యాక్ కాలపరిమితులు, మర్చంట్ సెటిల్‌మెంట్‌లపై స్పష్టమైన సమాచారం లభిస్తుంది. ఇది మొత్తం పేమెంట్ సిస్టమ్ కు మేలు చేస్తుంది


Click it and Unblock the Notifications