Bank Of Namibia: దేశీయంగా యూపీఐ సేవలు విస్రృత ప్రజాధరణను పొందిన సంగతి తెలిసిందే. ఒక్క దశాబ్ధంలోనే దేశంలోని చెల్లింపుల వ్యవస్థ రూపురేకలను మార్చేసింది యూపీఐ చెల్లింపుల వ్యవస్థ. భారత ప్రభుత్వం సైతం నకిలీ నోట్లు, నోట్ల ముద్రణ ఖర్చులు వంచి ఇబ్బందులను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ఇది తోడ్పడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు డిజిటల్ చెల్లింపులు మార్గాన్ని వేశాయి.
ఈ క్రమంలో NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్(NIPL) భారతదేశంలోని యూపీఐ తరహాలో తక్షణ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆఫ్రికాకు సైతం భారతీయ యూపీఐ చెల్లింపుల వ్యవస్థ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది. గత గురువారం ఒప్పందం తర్వాత NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఆఫ్రికన్ దేశం కోసం యూపీఐ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే మరొక దేశంలో యూపీఐ లాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడానికి NPCI ప్రముఖ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేయడం ఇదే మొదటిసారి.

నమీబియాలో నివసిస్తున్న వ్యక్తులు, వ్యాపారాలకు డిజిటల్ చెల్లింపుల్లో సహాయం చేయడానికి తక్షణ నగదు లావాదేవీలను సులువుగా పూర్తి చేసేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకోబడింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను నబీవియా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు యోచిస్తున్నట్లు NIPLపేర్కొంది. ఈ UPI సిస్టమ్ స్థానిక, అంతర్జాతీయ లావాదేవీలకు సహాయపడనుందని సమాచారం. వెనుకబడిన సమాచాజంలో భవిష్యత్తులో ఇది అవసరమయ్యే మంచి పరిణామాలను తీసుకువస్తుందని ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ సీఈవో రితేష్ శుక్లా అన్నారు.
ఇప్పటికే భారతీయ యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూర్, మారిషస్ వంటి దేశాలకు విస్తరించిన తరుణంలో తాజాగా ఆఫ్రికా సైతం తాజా ఒప్పందంతో ఈ జాబితాలోకి చేరిపోయింది. ఈ ఏడాది జనవరిలో NPCI "UPI-Pay Now" అనే డిజిటల్ వ్యవస్థను ప్రారంభించింది. దీని ద్వారా సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు తమ బ్యాంకు ఖాతాల్లో నేరుగా భారత్ నుంచి డబ్బును స్వీకరించవచ్చు. అదేవిధంగా సింగపూర్‌లో ఉంటూ పనిచేస్తున్న భారతీయులు తమ బ్యాంకు ఖాతాల నుంచి భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులకు డబ్బు నేరుగా పంపేందుకు వీలు కల్పించబడింది. యూపీఐ చెల్లింపుల వ్యవస్థ డబ్బుల నుంచి యుటిలిటీ చెల్లింపుల వరకు వేగవంతం చేసింది. గతంలో మాదిరిగా క్యూలలో నిలబడాల్సిన దుస్థితిని పూర్తిగా మార్చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు దీనిని స్వీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications