Limits on UPI: భారతీయ పేమెంట్స్ వ్యవస్థను చూసి అగ్రరాజ్యాలు సైతం కుళ్లుకుంటున్నాయి. నడిరోడ్డుపై కూడా టెక్నాలజీ ఉపయోగించి సెకన్ల వ్యవధిలో చెల్లింపులు చేయడం అంత తేలిక కాదు. కానీ ఈ అసాధ్యాన్ని UPI ద్వారా ఇండియా సుసాధ్యం చేసింది. అయితే ఇప్పటివరకు ఈ తరహా పేమెంట్స్‌పై లిమిట్ లేదా ఛార్జీలు లేకపోవడం UPI సక్సెస్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
సాఫీగా సాగిపోతున్న ఈ UPI చెల్లింపులకు త్వరలోనే కొన్ని బ్రేకులు పడనున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. కొన్ని లిమిట్స్ విధించాలని నియంత్రణ సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే వ్యవహారంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI), RBI కలిసి సంభావ్య పరిమితులపై చర్చలు జరుపుతోంది.

ప్రస్తుతానికి రోజువారీ UPI లావాదేవీల సంఖ్య లేదా విలువపై ఎటువంటి పరిమితి లేదు. అందుకే ప్రజలు ఈ సేవలను నిస్సందేహంగా స్వీకరించారు. అయితే 80 శాతం మార్కెట్ వాటా కలిగిన గూగుల్ పే మరియు ఫోన్ పే వంటి ప్లేయర్స్ ఆధిపత్యం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో UPI పర్యావరణ వ్యవస్థ స్థిరత్వానికి ఇది ముప్పుగా పరిణమిస్తుందని NPCI భావిస్తోంది.
రానున్న రోజుల్లో ఏ పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లపై పరిమితులు విధించాలని NPCI ఇప్పటికే ప్రతిపాదించింది. ఒక్కో యాప్ పైన 30 శాతం వాల్యూమ్ క్యాప్ పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే బ్యాంకులు వ్యక్తిగత లావాదేవీలపై రోజువారీ పరిమితి విధించాయి. NPCI లిమిట్ విధిస్తే దాని ప్రభావం వినియోగదారులపైనా ఉంటుందని విశ్లేషకుల అంచనా.
UPI పేమెంట్స్ పరిమితులపై ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే పరిశ్రమ ఫీడ్ బ్యాక్ మరియు కస్టమర్లపై ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుని, NPCI అందరికీ ఆమోదయోగ్యమైన డెసిషన్‌కు వస్తుందని భావిస్తున్నారు. నిబంధనల్లో ఏవైనా మార్పులు చేయాలని భావిస్తే వాటిని ముందుగానే వినియోగదారులకు స్పష్టంగా తెలియజేస్తారు. కాగా కొత్త ప్రొవైడర్లను ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో ఉత్తేజకరమైన ఫీచర్లను పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications