UPI Payments: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ బుధవారం యూపీఐలో వాయిస్ బేస్డ్ లావాదేవీల చెల్లింపులతో సహా మరికొన్ని కొత్త చెల్లింపు ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. వీటిలో ఒకటి Hello! UPI. దీనిని వినియోగదారులు టెలికాం కాల్స్, యాప్స్, ఐఓటీ పరికరాల ఆధారంగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిస్తుంది. రానున్న కాలంలో మరిన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎన్పీసీఐ వెల్లడించింది.

అలాగే యూపీఐపై క్రెడిట్ లైన్ ద్వారా అకౌంట్లో డబ్బు లేనప్పటికీ.. కస్టమర్లు తమ బ్యాంక్ ద్వారా పొందిన ప్రీ అప్రూవ్డ్ లోన్ నుంచి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చని NPCI ప్రకటించింది. అలాగే LITE X ఉత్పత్తిని ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో డబ్బును పంపడం, స్వీకరించటం చేయగలరని వెల్లడించింది. ఇంకా UPI ట్యాప్ & పే సదుపాయం, సంప్రదాయ స్కాన్-అండ్-పే పద్ధతితో పాటు, కస్టమర్‌లు తమ చెల్లింపులను పూర్తి చేయడానికి వ్యాపార సముదాయాల్లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC) ఆధారిత QR కోడ్ చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు అందుబాటులోకి వచ్చేస్తోంది.
భవిష్యత్తులో సంభాషనల ద్వారా చెల్లింపులు నిర్వహించేందుకు వీలుగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థ సిద్ధమౌతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మధ్య పరస్పర సంభాషణ డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని దేశంలో మరింత లోతుకు తీసుకెళుతుందని తెలుస్తోంది. రానున్న కాలంలో చెల్లింపుల విధానం మరింత విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications