UPI News: ఇక ఫోన్‍పే, గూగుల్‍పే కి చుక్కలే.. మహా సమరంలో ఓటమి తప్పదా? పూర్తి వివరాలు

PhonePe-Google Pay: భారత్ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే ఆలస్యంగా డిజిటల్ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి కొన్ని కంపెనీలు మాత్రమే మార్కెట్లో ఆధిపత్యాన్ని సంపాదించాయి. వీటి తర్వాత అనేక సంస్థలు తమ ఐపీవో సేవలను ప్రారంభించినప్పటికీ ఆ స్థాయిలో యూజర్లను సంపాదించలేకపోయిన సంగతి తెలిసిందే.

అయితే యూపీఐ చెల్లింపుల వ్యాపారంపై ప్రస్తుతం అనేక ఫిన్‍టెక్ కంపెనీలు తమ ఫోకస్ కొనసాగిస్తున్నాయి. వినూత్న ప్రొడక్స్ లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. అయితే ఆట ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరోలెక్క అన్నట్లుగా మారిపోతోంది. ఎందుకంటే ఏకంగా 2024 ఒక్క సంవత్సరంలోనే థర్డ్ పార్టీ యూపీఐ సేవలను స్టార్ట్ చేసేందుకు అనుమతుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద దరఖాస్తు చేశాయి. ఎన్పీసీఐ అధికారిక వెబ్ సైట్ ప్రకారం 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 సంస్థలు ఇలా యూపీఐ సేవలను అందించటం కోసం ఇప్పటి వరకు అనుమతులు పొందాయని వెల్లడైంది. ఈ పరిస్థితులు పోటీని మరింతగా పెంచటంతో పాటు యూజర్లకు మెరుగైన సేవలను అందించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

NPCI issues more licences to UPI fintechs fearing Giants PhonePe Google Pay paytm

వాస్తవానికి భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో గూగుల్ పే, ఫోన్ పేలు ఏకంగా 85 శాతం మార్కెట్ వాటాను కంట్రోల్ చేస్తుండటంతో అనేక ఫిన్‍టెక్ స్టార్టప్ కంపెనీలు కొంత భాగాన్ని పొందటం కోసం వినూత్న ఆఫర్లు, క్యాష్ బ్యాంక్స్, రివార్డ్ పాయింట్స్, వర్చువల్ రూపే క్రెడిట్ కార్డులు ఇలా అనేక ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. యూపీఐలో కేవలం రెండు కంపెనీలు ఆధిపత్యాన్ని కొనసాగించటాన్ని నివారించాలని ఎక్కువ మందిని ప్రోత్సహిస్తున్నట్లు రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ కివి సహ వ్యవస్థాపకుడు మోహిత్ బేడీ అన్నారు. వాస్తవానికి మర్చంట్ పేమెంట్స్ కోసం రూపే క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేస్తూ భారతీయ మార్కెట్లోకి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన మెుదటి కంపెనీ కివీ కావటం గమనార్హం.

ఈ ఏడాది యూపీఐ సేవల కోసం అనుమతులు అందుకున్న కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ డిజిటల్, క్యూరీ మనీ, భారత్ పే, ఫామ్ యాప్, ఫై మనీ, ఫియో, ఫ్లిప్ కార్ట్ యూపీఐ, జెన్ వైజ్, ఇండ్ మనీ, క్రెడిట్ పే, మనీ వ్యూ, వన్ కార్డ్, ఓకే క్రెడిట్, పేటీఎం, పాప్ క్లబ్, రియో మనీ, సాలరీసే, సూపర్ మనీ, ట్విడ్ పే, టి వాలెట్ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో నావీపే, సూపర్ మనీ, ఫామ్ పే యూపీఐలు ప్రజాదరణను పొందటంతో దాదాపు 2 శాతం కంటే తక్కువ మార్కెట్ షేర్ కొల్లగొట్టాయి. ప్రతి నెల యూపీఐ చెల్లింపుల ద్వారా 16.5 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరుగుతుండగా వీటి విలువ రూ.23.5 లక్షల కోట్లుగా ఉంది. చాలా కంపెనీలు యూపీఐ సేవలతో పాటు ఇతర ఫైనాన్స్ ఉత్పత్తులను కస్టమర్లకు తమ యాప్స్ ద్వారా అందించాలని చూస్తున్నాయి.

ప్రస్తుతం భారతీయ యూపీఐ కస్టమర్లు సదరు యాప్స్ ద్వారా.. ఈఎంఐ చెల్లింపులు, ఐపీవో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్‌లు, ఇన్సూరెన్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, క్రెడిట్ కార్డ్ నుంచి రెంట్ పేమెంట్స్, రుణాలు ఆఫర్ చేయటం సహా అనేక అవసరాలను ఈ యాప్స్ ద్వారా ప్రస్తుతం చేస్తున్నారు. దీనికి తోడు యుటిలిటీ బిల్ పేమెంట్స్ కోసం కూడా యూజర్లు వీటిని భారీగా వినియోగిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+