దేశంలో యూపీఐ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ ఎంత పెరుగుతున్నాయో.. అంతే స్థాయిలో కూడా మోసాలు జరుగుతోన్నాయి. అందుకే యూపీఐ చెల్లింపులో భద్రతను పాటిస్తున్నారు. ఇప్పటికే యూపీఐ పిన్ తో యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చర్యలు తీసుకుంటోంది.
UPI సురక్షితంగా చెల్లింపులు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. UPI ద్వారా చేసిన చెల్లింపులను ధృవీకరించడానికి (ప్రామాణీకరించడానికి) ఇప్పుడు బయోమెట్రిక్‌లు ఉపయోగించనున్నారు. వేలిముద్ర లేదా ఫేస్ ప్రమాణీకరణ మొదలైన వాటిని అమలు చేసే అలోచనలో ఎన్పీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. యూపీఐలో బయోమెట్రిక్ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు ఎన్పీసీఐ చాలా స్టార్టప్ కంపెనీలతో మాట్లాడుతోంది. ఇప్పుడు చాలా ఫోన్లు ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న ఈ ఫీచర్‌లను ఉపయోగించడం ద్వారా యూపీఐ చెల్లింపులను సురక్షితంగా చేయాలని ఎన్పీసీఐ యోచిస్తోంది.ఉదాహరణకు ఆండ్రాయిడ్ ఫోన్‌లను వాడుతున్న వినియోగదారులు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే దాన్ని ఉపయోగించి చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. చాలా Android స్మార్ట్‌ఫోన్‌లు ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తున్నాయి. చాలా ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉన్నాయి.
ఐఫోన్ వినియోగదారులు ఫేస్ ఐడి ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం యూపీఐ ద్వారా చెల్లింపు చేయడానికి PIN వాడుతున్నారు. వినియోగదారులు 4 లేదా 6 అంకెల పిన్‌ను సృష్టిస్తారు. దాని సహాయంతో లావాదేవీ నిర్ధారిస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంతో సహా అన్ని UPI చెల్లింపు యాప్‌ల ద్వారా లావాదేవీలు చేయడానికి, ప్రామాణీకరణ కోసం ఆ 4 లేదా 6 అంకెల పిన్ వాడుతున్నారు.


Click it and Unblock the Notifications