UPI Payments: దేశంలో ప్రజలు ఇప్పటి వరకు యూపీఐ సేవలను ఉచితంగా వినియోగించుకున్నారు. యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీలు ఉంటాయంటూ గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవమని.. తమకు అలాంటి ఉద్ధేశం లేదంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే ఛార్జీల మోత మెుదలు కానుంది. ఈ ఛార్జీలు ఎవరి నుంచి వసూలు చేస్తారు..? ఎంత వసూలు చేస్తారు..? ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 1 నుంచి UPI వ్యాపార లావాదేవీలపై ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (PPI) రుసుము వర్తించబడుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. రూ.2,000 కంటే ఎక్కువ మర్చంట్ లావాదేవీలపై కొత్తగా ఛార్జీల భారం ఉండనుంది. అయితే రెండు వేల రూపాయల కంటే పెద్ద మెుత్తం లావాదేవీల విలువలో 1.1 శాతాన్ని రుసుముగా వసూలు చేయనున్నట్లు ఇటీవలి సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

ఇంటర్‌చేంజ్ ధర ఏప్రిల్ 1, 2023న ప్రవేశపెట్టబడుతున్నప్పటికీ.. దీనిని మళ్లీ సెప్టెంబర్ 30, 2023 నాటికి సమీక్షించనున్నారు. ఇంటర్‌చేంజ్ ఫీజులను ప్రవేశపెట్టడం దేశంలోని డిజిటల్ చెల్లింపులను అందిస్తున్న బ్యాంకులు, చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్‌లకు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో తీసుకురాబడిందని తెలుస్తోంది. ఇంటర్‌చేంజ్ రుసుము కార్డ్ చెల్లింపులతో అనుబంధించబడుతుంది. లావాదేవీలను ఆమోదించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయటం వంటి ఖర్చులను కవర్ చేయడానికి విధించబడుతోంది.
దేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ అగ్రిగేటర్లైన BharatPe, Google Pay, Razorpay, Paytm, PayU, పైన్ ల్యాబ్స్ వంటి సంస్థలు యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపుల లావాదేవీలను అందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో జతకట్టాయి. రూపే క్రెడిట్ కార్డ్‌లను UPIకి లింక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల చర్యలు చేపట్టింది. కార్డ్ పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్ విస్తృతంగా అందుబాటులో లేని సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని వ్యాపారులకు ఈ చర్య ఎక్కువ ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రస్తుతం UPI ప్లాట్‌ఫారమ్‌లో భారతదేశం 250 మిలియన్లకు పైగా ప్రత్యేక వినియోగదారులను, 5 కోట్ల మంది వ్యాపారులను కలిగి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications