BHIM App: దేశంలో నగదు బదిలీ వ్యవస్థలను యూపీఐ చెల్లింపుల విధానం పూర్తిగా మార్చేసింది. దీంతో ఈ రంగంలో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి అనేక సంస్థలు ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చెల్లింపుల వ్యాపారంలో పోటీ భారీగానే కొనసాగుతోంది.
ఇలాంటి తరుణంలో కస్టమర్లను ఆకర్షించేందుకు దేశీయంగా సృష్టించబడిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCPI) రూపొందించిన యూపీఐ యాప్ బీమ్ వినియోగదారులకు రూ.750 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ చర్యలతో చాలా మంది ఇతర యాప్స్ వైపు మళ్లుతున్న వేళ ఆఫర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో బీమ్, గూగుల్ పై కొత్త కస్టమర్ల కోసం ఆఫర్లను ప్రకటించాయి.

ముందుగా రెస్టారెంట్లలో చేసే చెల్లింపులపై రూ.100 కంటే ఎక్కువ ప్రతి చెల్లింపుపై రూ.30 క్యాష్ బ్యాంక్ బీమ్ యాప్ అందిస్తోంది. రెస్టారెంట్లలో మొత్తాన్ని చెల్లించడానికి బీమ్ యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రైల్వే టిక్కెట్ బుకింగ్, టాక్సీ చెల్లింపు కోసం బీమ్ యాప్‌ని ఉపయోగిస్తే రూ.100-రూ.150 వరకు చెల్లింపులపై రూ.30 క్యాష్ బ్యాంక్ ఆఫ్ అందుబాటులో ఉంది. అలాగే రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసి చేసే చెల్లింపులకు రూ.100 క్యాష్ బ్యాంక్ ఉంది. తర్వాత చేసే 10 లావాదేవీలపై ప్రతి నెలా రూ.200 కంటే ఎక్కువ లావాదేవీలకు రూ.30 క్యాష్‌బ్యాక్‌ను పొందుతాయి. కాబట్టి మీరు మొత్తం 600 రూపాయలు ఆదా చేయవచ్చు.
రీఫ్యూయలింగ్‌పై 1% క్యాష్‌బ్యాక్ సదుపాయాన్ని సైతం బీమ్ యాప్ వినియోగదారులకు అందిస్తోంది. దీని కింద వినియోగదారులు పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కి చేసే చెల్లింపులపై రూ.10 క్యాష్ బ్యాంక్ పొందుతారు. అలాగే కరెంటు బిల్లుల చెల్లింపులపై కూడా ప్రయోజనం అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వినియోగదారులకు మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications