Payments: చెల్లింపుల వ్యవస్థలో భారత్ ఓ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. UPI ద్వారా కేవలం సెకన్ల వ్యవధిలో నగదు బదిలీ చేయడం సులభతరం అయింది. NEFT మరియు RTGS వంటి పేమెంట్ మోడ్స్‌కు ధీటుగా నిలబెట్టింది. అయితే ఈ సేవలు ఉచితంగానే అందుకోగలగడం ఓ పెద్ద బెనిఫిట్‌గా చెప్పుకోవచ్చు.
దేశ ప్రజలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చీఫ్ దిలీప్ తాజాగా షాక్ ఇచ్చారు. UPI ఆధారిత చెల్లింపుల కోసం భవిష్యత్తులో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బాంబ్ పేల్చారు. కొత్త ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి, వినియోగదారుల సంఖ్యను పెంచడానికి మరియు క్యాష్‌బ్యాక్‌ల వంటి ప్రోత్సాహకాలను అందించడానికి సహేతుకమైన ఛార్జీలు విధించబడవచ్చని పేర్కొన్నారు.

వచ్చే మూడేళ్లలో వారు UPI ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందరూ నగదుకు ప్రత్యామ్నాయ చెల్లింపులను అందించడం ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఆమోదాన్ని పెంచడంపై దృష్టి సారించాయన్నారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (BCAS) నిర్వహించిన ఓ కార్యక్రమంలో NPCI చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఈ లావాదేవీల కోసం ఇండస్ట్రీ ప్లేయర్స్‌కు పరిహారం చెల్లిస్తోంది. దీంతో ఇప్పటివరకు ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఇది వ్యవస్థ వృద్ధికి ఎంతగానో సహాయపడింది. అయితే UPI సేవలపై ఛార్జీలు విధిస్తే వివాదాలు చెలరేగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేమెంట్ వ్యవస్థలో లేనిపోని అవరోధాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications