Money Transfer: బారులుతీరిన క్యూ లైన్లలో నిలబడి నగదు ఉపసంహరణ కోసం ఇబ్బందులు ఎదుర్కొనే రోజులు పోయాయి. క్షణ కాలంలో అరచేతిలోనే బ్యాకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెరుపు వేగంతో నగదు బదిలీ జరుగుతోంది. కాగా ఈ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఆన్‌లైన్‌లో జరిపే నగదు చెల్లింపులు సాధారణంగా IMPS వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఇందుకోసం ఇప్పటివరకు బ్యాంక్ ఖాతా నెంబర్, లబ్ధిదారుని పేరు, బ్యాంక్ పేరు, IFSC కోడ్‌లను ఎంటర్ చేసి బెనిఫిషియరీని యాడ్ చేయాలి. అయితే మారిన నిబంధనల మేరకు బెనిఫిషియరీ ఎడిషన్ లేకుండానే కేవలం మైబైల్ నంబర్, బ్యాంక్ పేరు ఉపయోగించి ఇకమీదట ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు.

'జనవరి 31, 2024 నాటికి అన్ని IMPS ఛానెల్స్‌లో మొబైల్ నంబర్ మరియు బ్యాంక్ పేరు ద్వారా ఫండ్ బదిలీని ప్రారంభించడం జరుగుతోంది. అందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం' అని NPCI ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఈమేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం డిఫాల్ట్ MMIDతో ఖాతాదారుల బ్యాంక్ పేర్ల మ్యాపింగ్‌ను నిర్వహించాలని, అవసరమైతే UI/UXలో కూడా మార్పులు చేయాలని సూచించింది.
ప్రస్తుతం IMPS P2A (ఖాతా + IFSC) లేదా P2P (మొబైల్ నంబర్ + MMID) మోడ్‌ల ద్వారా నగదు బదిలీ లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. ఒకే మొబైల్ నంబర్‌తో అనుసంధానించబడిన వివిధ ఖాతాల విషయంలో కస్టమర్ సమ్మతి ఆధారంగా డిఫాల్ట్ ఖాతాకు నగదు క్రెడిట్ చేయబడుతుంది. వినియోగదారుని అంగీకారం లభించకపోతే ఆ లావాదేవీ తిరస్కారానికి గురవుతుంది.


Click it and Unblock the Notifications