UPI News: ప్రస్తుతం దేశంలో ప్రజలు భౌతిక నగదు వినియోగాన్ని భారీ స్థాయిలో తగ్గించేశారు. చిన్న మెుత్తాల్లో చెల్లింపులు చేయాలన్నా ప్రజలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన ముఖ్యమైన హెచ్చరిక వెలువడింది.
దేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. యూపీఐ చెల్లింపు సేవలను అందిస్తున్న Google Pay, Paytm, PhonePe, CRED వంటి థర్డ్ పార్టీ యాప్స్ కి కీలక సర్క్యులర్ జారీ చేసింది. తాజా సూచన ప్రకారం ఇకపై దేశంలో వినియోగంలో ఏడాది పాటు వినియోగంలో లేని యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ కానున్నాయి.

ఖాతాదారులు తమ పాత నంబర్‌ను బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తొలగించకుండా వారి మొబైల్ నంబర్‌ను మార్చుకున్నట్లయితే పొరపాటున పాత నంబర్లకు తప్పుగా డబ్బు పంపటాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. చట్టబద్ధమైన 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్‌స్క్రైబర్‌లకు డియాక్టివేట్ అయిన మెుబైల్ నంబర్లను తిరిగి కేటాయించకుండా మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లను నిరోధించలేమని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన తరుణంలో వినియోగదారుల పేమెంట్స్ భద్రత నిమిత్తం తాజా నిర్ణయం తీసుకోబడింది.
ఎన్పీసీఐ తాజా నిబంధనలను యూపీఐ సర్వీస్ ప్రొవైడింగ్ ఫిన్ టెక్ కంపెనీలు దేశంలో డిసెంబర్ 31 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో బ్యాంకులు UPI యాప్‌ల నుంచి ఏడాది పాటు ఎటువంటి ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీలను నిర్వహించని కస్టమర్‌ల UPI IDలు, అనుబంధిత UPI నంబర్లు, ఫోన్ నంబర్లను గుర్తించాలని పేర్కొంది. UPI IDలు మరియు బ్లాక్ చేయబడిన ఫోన్ నంబర్‌లపై ఇన్‌వర్డ్ క్రెడిట్ ఉన్న కస్టమర్‌లు UPI మ్యాపర్ లింకేజ్ కోసం వారి యూపీఐ యాప్‌లలో మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రానున్న కాలంలో మారిన నిబంధనల ప్రకారం యూపీఐ యాప్స్ 'పే-టు-కాంటాక్ట్', 'పే టు మెుబైల్ నంబర్' ప్రారంభించే ముందు రిక్వెస్టర్ వాలిడేషన్ (ReqValAd) నిర్వహిస్తాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులను, సురక్షితమైన లావాదేవీల అనుభవాన్ని నిర్ధారించడానికి కస్టమర్‌లు బ్యాంకింగ్ వ్యవస్థలో తమ సమాచారాన్ని క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ, ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications