గత ఏడాది ద్వితీయార్థంలో (జూలై-డిసెంబర్) కాలంలో బ్యాంకుల ఆస్తుల నాణ్యత కాస్త మెరుగైందని, ఐతే 2021 ప్రథమార్థంలో(జనవరి-జూన్) నాటికి తిరిగి క్షీణించే ప్రమాదం ఉందని ఫిక్కీ-ఐబీఏ సర్వే నివేదిక వెల్లడించింది. ఫిక్కీ-ఐబీఏ సంయుక్తంగా చేపట్టిన పన్నెండో రౌండ్ బ్యాంకర్స్ సర్వే గత ఏడాది ద్వితీయార్థంలో ఇరవై బ్యాంకులపై ఈ సర్వే చేపట్టింది. అందులో ప్రభుత్వ, ప్రయివేటురంగాలతో పాటు విదేశీ బ్యాంకులు ఉన్నాయి. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఆస్తుల్లో వీటి వాటా 59 శాతంగా ఉంది.

ఎన్పీఏలు జంప్
2021 మొదటి 6 నెలల్లో ఎన్పీఏలు 10 శాతం పైగా పెరిగే అవకాశముందని దాదాపు 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది ఏకంగా 12 శాతం క్రాస్ చేయవచ్చునని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నెలలో ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబులిటీ నివేదిక సెప్టెంబర్ 2021 నాటికి ఎన్పీఏలు 13.5 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది. అధిక ఎన్పీఏ రిస్క్ కలిగిన వాటిలో టూరిజం, హాస్పిటాలిటీ, ఎంఎస్ఎంఈ, ఏవియేషన్, రెస్టారెంట్స్ ఉన్నట్లు వెల్లడించింది.

ఏ రంగంలో ఎంత అంటే
గత ఏడాది రెండో అర్ధభాగంలో ఎన్పీఏలు తగ్గుముఖం పట్టినట్లు సర్వేలో పాల్గొన్న బ్యాంకుల్లో సగం పేర్కొన్నాయి. PSUs వాటా 78 శాతంగా ఉంది.రవాణా, ఆతిథ్య రంగాల్లో ఎన్పీఏలు భారీగా పెరిగిపోతుందని అంచనా వేస్తున్నవారు 55 శాతం ఉన్నారు. 45 శాతం మంది ఈ రంగంలో ఎన్పీఏల భారం కొద్దిగా ఉంటుందని భావిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి భారీ ఎన్పీఏల భారం ఉంటుందని 84 శాతం వరకు అంచనా వేయగా, రెస్టారెంట్‌కు సంబంధించి 89 శాతంగా ఉంది. ఈ విభాగంలో ఎన్పీఏల భారం కొంతేనని అంచనా వేసినవారు 26 శాతంగా ఉన్నారు.

లక్ష కోట్లు తగ్గి
కరోనా నేపథ్యంలో ఎంఎస్ఎంఈలో వన్ టైమ్ లోన్ పునర్వ్యవస్థీకరణకు విజ్ఞప్తులు పెరిగాయి. మౌలిక, ఔషధ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో దీర్ఘకాలిక రుణ డిమాండ్ పెరుగుతోందని వెల్లడైంది. ఫార్మా రంగానికి రుణ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు 45 శాతానికి పెరిగాయి. ఇదిలా ఉండగా, 2020 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు రూ.లక్ష కోట్లకు పైగా (రూ.6,78,317 కోట్ల నుండి రూ.5,77,137 కోట్లకు) తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది.


Click it and Unblock the Notifications