NPA: జాతీయ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గురించి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. వాటి ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడటంలో మొండి బకాయిల(NPA) నిర్వహణ ఎంతో కీలకం. వాటిపై తాజాగా RBI నివేదిక విడుదల చేసింది.
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నికర నిరర్థక ఆస్తులు (NPA)లు భారీగా తగ్గినట్లు తన ఆర్థిక స్థిరత్వ నివేదిక(FSR)లో రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. మార్చి 2023లో NPA నిష్పత్తి 10 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు తెలిపింది. మార్చి 2018లో అత్యధికంగా 11.5 శాతం, 6.1 శాతంగా ఉన్న స్థూల, నికర NPA నిష్పత్తి.. మార్చి 2023 నాటికి వరుసగా 3.9 శాతం, 1.0 శాతానికి తగ్గడం శుభపరిణామంగా పేర్కొంది.

గత FSR నివేదిక విడుదల చేసినప్పటి నుంచి దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో భారీ మార్పులు జరిగాయి. అయితే వాటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని, భారత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల సహకారంతో ఈ నివేదికను 6 నెలలకొకసారి సెంట్రల్ బ్యాంకు విడుదల చేస్తుంది.

'మార్చి 2023లో US, యూరప్ లో ఏర్పడిన బ్యాంకింగ్ సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన ఒత్తిడికి గురైంది. కానీ భారత ఆర్థిక రంగం మాత్రం స్థిరంగా ఉంది. బ్యాంక్ క్రెడిట్ లో స్థిరమైన వృద్ధి, తక్కువ NPAలు, తగిన మూలధనం మరియు లిక్విడిటీ కలిగి ఉండటం వల్లే ఇది సాధ్యమైంది' అని RBI గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications