యువరాజ్ సింగ్ కొత్త బ్రాండ్.. బిజినెస్ పిచ్‌పై ఫినో టెకీలా లాంచ్..

Yuvraj Singh New Innings: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. అయితే ఈ ఇన్నింగ్స్ క్రికెట్ సంబంధించి కాదు వ్యాపారానికి సంభందించింది. ఇందుకు యువరాజ్ సింగ్ అల్ట్రా-ప్రీమియం స్పిరిట్స్ బ్రాండ్ ఫినో టెకీలాను ప్రారంభించడానికి కొంతమంది వ్యాపార దిగ్గజాలతో టై అప్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ బ్రాండ్ అమెరికన్ మార్కెట్లో ప్రవేశపెట్టారు. బాలీవుడ్ ఫెమస్ 'విలన్' అంటే సంజయ్ దత్ కూడా మద్యం వ్యాపారంలో ఉన్నారు. సంజయ్ కార్తెల్ & బ్రదర్స్‌తో కలిసి స్కాచ్ విస్కీ బ్రాండ్ ది గ్లెన్‌హాకెన్‌ను ప్రారంభించాడు, ప్రస్తుతం ఈ బ్రాండ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.

చికాగోలో ప్రారంభం

హోటలియర్ ఇండియా ప్రకారం, అమెరికాలోని చికాగోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఫినో టెకీలా ప్రారంభించారు. ఇన్విటేషన్ ఉన్న వారికి మాత్రమే ఈ లాంచ్ కార్యక్రమానికి హాజరు కావడానికి అనుమతి ఉంటుంది. మెక్సికోలోని జాలిస్కోలో రూపొందించిన ఫినో టెకీలా, 'ఫెల్యూర్ ఒక అప్షన్ కాదు' అనే ఫిలాసఫీని సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నాటికి FINO భారతదేశంలో కూడా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

Now Yuvraj Singh will bat on the business pitch launched premium Tequila brand FINO

యువరాజ్ ఏమన్నాడంటే ?

ఈ లాంచ్ కార్యక్రమంలో FINO చీఫ్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, FINO నేను నమ్మే రిసిలెన్స్, ఎక్సలెన్స్ ఇంకా సవాళ్లను విజయాలుగా మార్చుకునే ధైర్యం ప్రతిది పూర్తిగా ఉంది. క్రికెట్ ఇంకా జీవితం పట్ల నా విధానంలాగే FINO కూడా సరిహద్దులను అధిగమిస్తూ ఇంకా దృఢ సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తుంది అని అన్నారు.

బ్రాండ్ పేరు అర్థం ఏమిటి?
ఫినో లీడర్షి బృందంలో జానా అయ్యర్ (చీఫ్ ప్రొడక్ట్ ఎక్సలెన్స్ ఆఫీసర్), సోనాలి పటేల్ (చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్), నిక్ పటేల్ (చీఫ్ విజనరీ) అండ్ విక్రమ్ కుమార్ (చీఫ్ రెవెన్యూ ఆఫీసర్) కూడా ఉన్నారు. FINO అనే పేరు స్పానిష్‌లో జరిమానా/సున్నితమైనది అని అర్ధం, కానీ బ్రాండ్ పేరు 'ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ ఆప్షన్' అనే దానికి పూర్తి రూపం. ప్రస్తుతం, FINO చికాగోలోని కొన్ని టాప్ ప్రదేశాలలో అందుబాటులో ఉంది, కానీ త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ కావొచ్చు, అది కూడా డ్యూటీ-ఫ్రీ షాపులతో ప్రారంభమవుతుంది.

యువరాజ్ ఎంత పెట్టుబడి పెట్టారు?
ఈ వ్యాపారంలోకి ప్రవేశించడానికి యువరాజ్ సింగ్ ఎంత పెట్టుబడి పెట్టారో ఇంకా స్పష్టంగా తెలియలేదు, కానీ పెట్టుబడి భారీగా ఉండొచ్చు. సంజు బాబా (సంజయ్ దత్) కొంతకాలం క్రితమే మద్యం మార్కెట్‌లోకి ప్రవేశించాడు. అతని కాలంలోని దిగ్గజ హీరో డానీ డెంజోంగ్పా చాలా కాలంగా ఈ వ్యాపారంలో ఉన్నాడు. 1987లో 'యుక్సమ్ బ్రూవరీస్' పేరుతో సిక్కింలో బీరు వ్యాపారాన్ని ప్రారంభించి, క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. 2005లో ఒడిశాలో డెంజోంగ్ బ్రూవరీస్ స్థాపనతో డెంజోంగ్పా తన వ్యాపారాన్ని విస్తరించాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+