ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్.. ఇప్పుడు ఈజీగా పిఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు..
ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. దీనిని మీరు ఉద్యోగం చేసే కంపెనీ లేదా సంస్థా అందిస్తుంది. అయితే మీ జీతం నుండి కొంత ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది. ఈ pf డబ్బుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. దింతో భారత ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. 2025 సంవత్సరం మధ్య నాటికి EPFO అకౌంట్ ఉన్నవారికి ATM నుండి డెబిట్ కార్డ్ ద్వారా PF డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నారు. అయితే ఈ విత్ డ్రా పై పరిమితి ఉంటుంది అలాగే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు విత్‌డ్రాతో పాటు రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి పొందవచ్చు. ఈ సదుపాయం ప్రభుత్వ EPFO 3.0 ప్రణాళికలో భాగంగా వస్తుంది. ఉద్యోగుల pf పై మరింత నియంత్రణను ప్రభుత్వం కల్పించాలన్నారు. EPFO 3.0లో ప్రభుత్వం ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాలను అందించాలని కోరుకుంటుంది.
నివేదికల ప్రకారం పిఎఫ్‌కి ఉద్యోగుల సహకారంపై 12 శాతం పరిమితిని ప్రభుత్వం తొలగించవచ్చు. ఇందులో ఉద్యోగులు వారి సేవింగ్స్ ప్రకారం కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వవచ్చు. అలాగే ఉద్యోగులు ఎక్కువ మొత్తాన్ని పీఎఫ్‌లో డిపాజిట్ ద్వారా పెద్ద ఫండ్‌ను జమ చేయవచ్చు. ప్రస్తుతం ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో 12 శాతం మాత్రమే పీఎఫ్‌లో డిపాజిట్ అవుతుంది. కానీ EPFO 3.0లో ఎక్కువ సహకారం అందించవచ్చు.

EPFO 3.0లో భాగంగా ఉద్యోగులు ATM ద్వారా PF డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం లభిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులు pf విత్ డ్రా కోసం అప్లయ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఉద్యోగులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు EPFO వెబ్‌సైట్ ( https://www.epfindia.gov.in ) లేదా ఉమంగ్ యాప్ ద్వారా PF డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు . ఈపీఎఫ్‌లో పెన్షన్ మొత్తాన్ని పెంచాలని చాలా కాలంగా ఉద్యోగుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా EPFO 3.0లో పెన్షన్ మొత్తాన్ని పెంచే పని జరగాలని కూడా భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల కోట్లాది మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.


Click it and Unblock the Notifications