ఆన్ లైన్ ట్రాన్సక్షన్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దింతో వీటిని మరింతగా ప్రోత్సహించేందుకు NPCI తాజాగా కొత్త చర్యలు చేపడుతుంది. 16 జూన్ 2025 నుండి ఇక మీ UPI ట్రాన్సక్షన్ (డెబిట్-క్రెడిట్) కేవలం 15 సెకన్లలో పూర్తి అవుతుంది. ప్రస్తుతం ఇందుకు 30 సెకన్లు పడుతుంది. UPI కార్యకలాపాలలో API రెస్పాన్స్ సమయాన్ని తగ్గించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశించింది. రెస్పాన్స్ సమయం అంటే ట్రాన్సక్షన్ ప్రారంభం నుండి ముగింపు వరకు పట్టే సమయం. దీనితో పాటు, ట్రాన్సక్షన్ స్టేటస్ చెక్ చేయడం లేదా డబ్బు పొందడం కూడా 75% వేగవంతం అవుతుంది. కానీ ఈ కొత్త రూల్ మీ UPI అనుభవాన్ని ఎలా మారుస్తుంది, UPIలో ఏవైనా సమస్యలను కలిగిస్తుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ET ప్రకారం, ఉదాహరణకు మీరు ఒక షాపుకి వెళ్లి రూ. 500 విలువైన వస్తువులను కొనుగోలు చేశారని అనుకుందాం. మీరు ICICI బ్యాంక్ iMobile యాప్ నుండి QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ చేసారు. ఈ QR కోడ్ HDFC బ్యాంక్ అకౌంటుకు లింక్ చేయబడితే, ICICI బ్యాంక్ పేమెంట్ రిక్వెస్ట్ రూపొందిస్తుంది, ఇంకా NPCI నెట్‌వర్క్ ద్వారా HDFC బ్యాంక్‌కు వెళ్తుంది. పేమెంట్ జరిగిందో లేదో చెక్ చేసిన తర్వాత HDFC బ్యాంక్ రెస్పాన్స్ పంపుతుంది. ఇది మళ్ళీ NPCI నెట్‌వర్క్ నుండి ICICI బ్యాంకుకు వస్తుంది. గతంలో దీనికి 30 సెకన్లు పట్టేది. కానీ జూన్ 16 నుండి, ఈ మొత్తం ప్రక్రియకి కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది.
ఈ సిస్టం ఎలా పని చేస్తుందంటే: దీనివల్ల ట్రాన్సక్షన్ సమయం తగ్గడమే కాకుండా స్టేటస్ చెక్ చేయడంలో కూడా పెద్ద తేడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ట్రాన్సక్షన్ ప్రారంభించిన లేదా వెరిఫైడ్ తర్వాత PSP బ్యాంక్/కొనుగోలు చేస్తున్న బ్యాంక్ మొదటిసారి 90 సెకన్ల పాటు స్టేటస్ చెక్ చేయవచ్చని కొత్త నియమాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఈ సమయం 45 నుండి 60 సెకన్లకు పెరిగింది. ఏప్రిల్‌లో UPI ద్వారా లావాదేవీలు సంవత్సరానికి 34% పెరిగి 17.89 బిలియన్లకు చేరుకుంది. అయితే, మార్చితో పోలిస్తే ఇందులో స్వల్ప తగ్గుదల కనిపించింది. గత నెలలో చూస్తే మొత్తం రూ. 18.30 బిలియన్లు. ఏప్రిల్‌లో లావాదేవీలతో పాటు, UPI ద్వారా లావాదేవీల మొత్తం కూడా పెరిగింది. దింతో సంవత్సరానికి 22 శాతం పెరిగి రూ.23.95 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చిలో మొత్తం UPI లావాదేవీల విలువ రూ.24.77 లక్షల కోట్లు. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో UPI లావాదేవీలు, లావాదేవీల విలువ తగ్గడానికి కారణం నెలలో రోజుల వ్యత్యాసం. అంటే మార్చిలో 31 రోజులు, ఏప్రిల్‌లో 30 రోజులు ఉన్నాయన్నమాట.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications