క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫార్మ్ బ్లింకిట్ ఇప్పుడు ఒక కొత్త సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీస్ 10 నిమిషాల్లో అంబులెన్స్ సర్వీస్ దీనిని ప్రస్తుతం గురుగ్రామ్ నగరంలో ప్రవేశపెట్టింది. బ్లింకిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అల్బిందర్ ధింద్సా నేడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో దీనికి సంబంధించి పోస్ట్ చేసారు. మా సర్వీసెస్ లభించే నగరాల్లో క్విక్ అండ్ నమ్మకమైన అంబులెన్స్ సర్వీస్ అందించే సమస్యను పరిష్కరించడానికి మేము ఒక అడుగు ముందుకు వేస్తున్నాము" అని Xపోస్టులో చెప్పారు. ప్రస్తుతం గురుగ్రామ్ నగరంలో కంపెనీ ఈరోజు ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించింది, త్వరలో కంపెనీ మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీస్ విస్తరించే ఆలోచనలో ఉందని అల్బిందర్ ధింద్సా తెలిపారు.
"మొదటి ఐదు అంబులెన్స్‌లు ఈరోజు నుండి గురుగ్రామ్‌లో రోడ్స్ పైకి వస్తాయి. మేము ఈ సర్వీస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకా @letsblinkit యాప్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్‌ని బుక్ చేసుకునే అప్షన్ చూస్తారు" అని Xపోస్ట్‌లో అంబులెన్స్ ఇన్ 10 మినట్స్ పేరుతో పోస్ట్ చేసారు. "కంగ్రాచ్యులేషన్స్ అల్బీ! చాలా ఉపయోగకరమైన ఆలోచన. ఇది పూర్తిగా వాణిజ్యపరంగా విజయవంతమవుతుందని అలాగే మరిన్ని నగరాల్లో అంబులెన్స్ సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాము , "అంటూ Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ Xలో
రిప్లయ్ చేసారు.

బ్లింకిట్ అంబులెన్స్ ఫీచర్లు
Xలోని పోస్ట్ ప్రకారం, కొత్తగా ప్రారంభించిన బ్లింకిట్ అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, మానిటర్లు అలాగే స్ట్రెచర్‌లు వంటి వైద్య పరికరాలతో పాటు ఇతర అవసరమైన మెడికల్ టూల్స్ ఉంటాయి. "మా అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, AED (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, అవసరమైన అత్యవసర మందులు, ఇంజెక్షన్‌లతో సహా ప్రాణాలను రక్షించే పరికరాలు ఉన్నాయి " అని బ్లింకిట్ CEO Xలో వెల్లడించారు. ప్రతి అంబులెన్స్‌లో ఒక పారామెడిక్, అసిస్టెంట్ అండ్ ట్రైనింగ్ పొందిన డ్రైవర్ కూడా ఉంటారు.
10-నిమిషాల అంబులెన్స్ సర్వీస్ వెనుక ఉన్న ఆలోచనను అల్బిందర్ ధింద్సా చెప్తూ చాల కాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఈ సర్వీస్ అందుబాటు ఖర్చుతో నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. "లాభం ఇక్కడ లక్ష్యం కాదు. మేము ఈ సర్వీస్ కస్టమర్లకు అందుబాటులో ఉండే ధరతో నిర్వహిస్తాము "అని కూడా పోస్ట్ చేసారు. బ్లింకిట్ రాబోయే రెండేళ్లలో అన్ని ప్రముఖ నగరాలకు అంబులెన్స్ సేవలను తీసుకురావాలని చూస్తుంది. బ్లింకిట్ ఈ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభంను సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రజలు ప్రశంసించారు. ఎక్కువ డిమాండ్ ఉన్న సమయాల్లో సర్వీస్ అధిక ధర ఉండటం గురించి కూడా ఆందోళనలను వ్యక్తం చేసిన వారు ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications