ఇప్పుడు గూగుల్ మీటింగ్ యాప్ తో జీ మెయిల్: కరోనా టైం లో అప్డేట్ అవుతున్న నెట్వర్కింగ్ దిగ్గజాలు
కరోనా లాక్ డౌన్ సమయంలో అన్ని సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజాలు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు అప్డేట్ అవుతున్నాయి. ఇప్పటికే జూమ్ , స్కైప్, హాంగ్ అవుట్, డుయో వంటి యాప్ ల ద్వారా వీడియో కాల్స్ , వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ , గ్రూప్ కాల్స్ మాట్లాడుతున్న వారి అవసరాలకు తగ్గట్టు ఇప్పుడు జీ మెయిల్ కూడా గూగుల్ మీటింగ్ ఆప్‌ను జీ-మెయిల్‌కు డైరెక్టుగా అనుసంధానం చేసింది. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా సరే నిరభ్యంతరంగా కాల్స్, గ్రూప్ కాల్స్, చాట్స్ కూడా చేసుకోవచ్చు.

గూగుల్ మీటింగ్ ఆప్‌ను జీ-మెయిల్‌కు డైరెక్టు లింక్
ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోం పని చేస్తున్న వారి కోసం , అలాగే ఇళ్లకే పరిమితమై నెట్వర్కింగ్ సైట్స్ వినియోగిస్తున్న వారికి ఇప్పుడు ఉపయుక్తంగా ఉండటానికి గూగుల్ మీటింగ్ ఆప్‌ను జీ-మెయిల్‌కు డైరెక్టుగా లింక్ చేసి వీడియో కాలింగ్ సేవలు అందిస్తుంది . ఇక దీనితో జీ-మెయిల్ ఖాతాను తెరవగానే ఎడమ వైపు మీట్ పాప్ అప్ కనిపిస్తుంది. మీట్ సెస్సన్ కింద, స్టార్ట్ మీటింగ్ లేదా జాయిన్ మీటింగ్ అనే రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇక దానిని బట్టి వారే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది వాడుకోవచ్చు . ఇది ఇక జీ-మెయిల్ ఖాతాదారులకు చాలా సులభంగా ఎటువంటి శ్రమ లేకుండా డైరెక్టుగా వినియోగించుకునేలా ఉంటుంది.

ఇతర వీడియో కాలింగ్ ప్లాట్ ఫామ్ ల కంటే ఇది సులువు
ఇప్పటికే గూగుల్ ప్రీమియం మీట్ యాప్ ను వినియోగదారులందరికీ ఉచితం చేసింది గూగుల్ . ఇక తాజాగా జీ మెయిల్ కు కూడా అనుసంధానం చేసి మీట్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు ఈ ఆప్షన్ ను అందిస్తుంది జీ మెయిల్ .దాదాపు అందరూ జీ మెయిల్ వినియోగిస్తున్న కారణంగా ఈ ఆప్షన్ వారికి మరింత సౌకర్యంగా ఉంటుందని గూగుల్ భావిస్తుంది . ఇతర వీడియో కాలింగ్ ప్లాట్ ఫామ్ ల కంటే ఇది సులువుగా ఉంటుందని ఈ వెసులుబాటు కల్పించింది.

గూగుల్ మీట్ యాప్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్
ఇక జీ మెయిల్ మీట్ కాల్ ఎలా కనెక్ట్ చెయ్యాలంటే జీ మెయిల్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ లో మీట్ పాప్ అప్ లో స్టార్ట్ మీటింగ్ , జాయిన్ మీటింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. స్టార్ట్ మీటింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీరే కాల్ స్టార్ట్ చేస్తారు. అందులో వీడియో, మైక్రో ఫోన్స్ పర్మిషన్ ఓకే చేస్తే కాల్ స్టార్ట్ అవుతుంది. ఎవరితో మాట్లాడాలి అనుకుంటారో వారికి ఆ లింక్ షేర్ చేస్తే వారు కూడా జాయిన్ అవుతారు . ఇది మాత్రమే కాదు గూగుల్ మీట్ యాప్‌లో కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అందులో షెడ్యూలింగ్, షేరింగ్ స్క్రీన్ షాట్స్, రియల్ టైం క్యాప్షన్స్, అవసరానికి అనుగుణంగా మీరు ఎంచుకోగల లే అవుట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు వాడుకోవచ్చు .


Click it and Unblock the Notifications