IPO News: మార్కెట్లలో ఐపీవో బిజీ.. కొత్తగా 5 ఐపీవో లాంచ్‌లు.. 7 లిస్టింగ్స్..
IPO News: నవంబర్ నెల చివరి వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త బిజీబిజీగా ఉండనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఐపీవోలు వరుసగా మార్కెట్లలో అరంగేట్రానికి క్యూ కట్టడమే. దీంతో ఇన్వెస్టర్లు సైతం ఫుల్ జోష్ కొనసాగిస్తున్నారు.
గడచిన వారంలో టాటా టెక్నాలజీస్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారుల నుంచి మంచి ఆసక్తిని ఎదుర్కొన్నాయి. విజయవంతంగా ముగియటంతో ఇవి ఈవారం T+3 టైమ్‌లైన్‌లో భాగంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో జాబితా అయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఐఆర్‌ఈడీఏ నవంబర్ 29న లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

SME క్యాగిరీలో మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలను పరిశీలిస్తే..
- ముందుగా ఈ విభాగంలో కలరెంట్స్ తయారీ కంపెనీ దీపక్ కెమ్‌టెక్స్ రూ.23 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధర రూ.76-80గా కంపెనీ నిర్ణయించింది. ఇది సబ్ స్క్రిప్షన్ కోసం నవంబర్ 29న తెరుచుకుంటోంది.
- అలాగే ఫోర్జెడ్ కాంపోనెంట్స్ మేకర్ AMIC ఫోర్జింగ్ కూడా ఈ సమయంలో పబ్లిక్ ఇష్యూని ప్రారంభించనుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.34.8 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకోసం ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.121-126గా నిర్ణయించింది.
- భారతీయ దుస్తులు, ఉపకరణాల కోసం ఆన్‌లైన్ డిజిటల్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ బిజినెస్ అయిన చెన్నైకి చెందిన నెట్ అవెన్యూ టెక్నాలజీస్ రూ.10.25 కోట్ల ఆఫర్ నవంబర్ 30న ప్రారంభించబడుతుంది. ఈ క్రమంలో ఐపీవో కోసం ఒక్కో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.16-18గా నిర్ణయించింది.
- గ్రాఫిసాడ్స్ ఐపీవో సైతం బిడ్డింగ్ కోసం నవంబర్ 30న తెరుచుకుంటోంది. కంపెనీ మార్కెట్ల నుంచి రూ.53.4 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ఒక్కో షేరును రూ.111 స్థిర రేటు వద్ద విక్రయిస్తోంది. కంపెనీ ఒక మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ.
- మారినేట్రాన్స్ ఇండియా SME సెగ్మెంట్ వస్తున్న లాజిస్టిక్స్ కంపెనీ ఐపీవో. ఇది మార్కెట్ల నుంచి రూ.10.92 కోట్లను సమీకరిస్తోంది. దీనికోసం ఒక్కో షేర్ ధరను రూ.26గా నిర్ణయించింది.
- PET బాటిల్స్, ప్రీఫారమ్‌ల తయారీదారు స్వస్థిక్ ప్లాస్కాన్ తన రూ.40.76 కోట్ల ఆఫర్‌ను నవంబర్ 29న ముగించనుంది. దీనికోసం ఒక్కో షేరు ధర రూ.80-86గా నిర్ణయించింది.
- ఇక మార్కెట్లోకి వస్తున్న ఐపీవో ఆరోహెడ్ సెపరేషన్ ఇంజనీరింగ్ కంపెనీది. నవంబర్ 16-20 మధ్య కాలంలో ఐపీవో మంచి స్పందనను పొందింది. ఇక చివరిగా మనం మాట్లాడుకోబోతున్న రాకింగ్ డీల్స్ సర్క్యులర్ ఎకానమీ ఐపీవో నవంబర్ 30న NSE ఎమర్జ్‌లో ప్రారంభమవుతుంది. ఇది మార్కెట్ల నుంచి రూ.21 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆఫర్ ధరను షేరుకు రూ.140గా నిర్ణయించబడింది.


Click it and Unblock the Notifications