Holiday: నవంబర్ 24న స్కాళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!
హైదరాబాద్లోని పలు పాఠశాలలు రెండు పండుగల దృష్ట్యా నవంబర్ 24 మంగళవారం నాడు సెలవు ప్రకటించాయి. మంగళవారం నాడు నగరంలో గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి రెండూ జరుపుకోనున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 24న సెలవు దినంగా ప్రకటించింది. దీనిని 'సాధారణ సెలవుల' జాబితాలో చేర్చింది. గురునానక్ జయంతి లేదా గురునానక్ దేవ్ జీ గురుపురబ్ రోజున, సిక్కు సమాజం మొదటి సిక్కు గురువు అయిన గురునానక్ జన్మదినాన్ని జరుపుకుంటుంది. సిక్కు మత స్థాపకుడైన గురునానక్, సిక్కు సమాజంలో అత్యంత గౌరవనీయులైన గురువుగా పరిగణిస్తారు.
అదేవిధంగా కార్తీక పౌర్ణమి అనేది హిందువులు, సిక్కులు, జైనులు జరుపుకునే ఒక సాంస్కృతిక పండుగ. ఇది కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున (15వ రోజున) వస్తుంది. ఈ పండుగల నేపథ్యంలో, హైదరాబాద్లోని అనేక పాఠశాలలు మంగళవారం నాడు సెలవు ప్రకటించాయి. డిసెంబర్ నెలలో హైదరాబాద్లోని పాఠశాలలకు కనీసం ఏడు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
ఈ ఏడు రోజులలో నాలుగు ఆదివారాలు కాగా, మిగిలిన మూడు రోజులు క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా సెలవులుగా ఉంటాయి. ఇవి డిసెంబర్ 24 నుండి 26 వరకు ఉంటాయి.

మరోవైపు డిసెంబర్ 26న హజ్రత్ ఇమామ్ అలీ జన్మదినం వస్తోంది. ఆ రోజు ఇప్పటికే బాక్సింగ్ డే కారణంగా సెలవు దినంగా ఉంది. డిసెంబర్ 25, 26 తేదీలు సాధారణ సెలవు దినాలు కాగా, క్రిస్మస్ ఈవ్ ఐచ్ఛిక సెలవు దినంగా (optional holiday) ఉంటుంది. హైదరాబాద్లోని మిషనరీ పాఠశాలలకు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు మొత్తం ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications