IPO News: ప్రీమియం ధరకు ఐపీవో లిస్టింగ్.. తొలిరోజు ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలు..

Nova Agritech IPO: జనవరి నెల చివరి రెండు రోజుల్లో అనేక ఐపీవోలు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే ఇవన్నీ ఇన్వెస్టర్లకు బంపర్ రాబడులను అందించి సూపర్ లాభాలను తొలిరోజే అందజేశాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నోవా అగ్రిటెక్ లిమిటెడ్ ఐపీవో గురించే. బుధవారం మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో దాదాపు 36.6 శాతం ప్రీమియం రేటు రూ.56 వద్ద బీఎస్ఈలో గ్రాండ్ లిస్టింగ్ నమోదు చేసింది. అలాగే ఎన్ఎస్ఈలో స్టాక్ రూ.55 రేటు వద్ద జాబితా కాగా వాస్తవంగా ఇష్యూ రేటు రూ.41గా ఉంది.

Nova Agritech IPO made grand premium listing on first day investors gained heavily

వాస్తవానికి కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కోసం జనవరి 23 నుంచి జనవరి 25 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.39-41గా కంపెనీ ప్రకటించింది. తాజా ఐపీవో నుంచి కంపెనీ మెుత్తంగా రూ.143.81 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.112 కోట్ల విలువైన మెుత్తానికి తాజా ఈక్విటీ షేర్లను విక్రయించగా.. మిగిలిన మెుత్తాన్ని సమీకరించేందుకు ఆఫర్ ఫర్ సేల్ కింద 77.58 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేసింది.

తాజా ఐపీవోకు కంపెనీ లాట్ పరిమాణాన్ని 365 షేర్లుగా నిర్ణయించింది. దీంతో రూ.56 రేటు వద్ద జాబితా కావటం కారణంగా పెట్టుబడిదారులు మెుదటి రోజే ఒక్కో లాటుకు రూ.5,475 లాభంగా అందుకున్నారు. 2007లో స్థాపించబడిన కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. నోవా అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ ప్రధానంగా మట్టి ఆరోగ్యం, ప్లాంట్ న్యూట్రిషన్, పంట సంరక్షణ అనే మూడు అంశాలపై వ్యాపారాన్ని విస్తరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+