Sai Parenterals: జాక్ పాట్ కొట్టిన హైదరాబాద్ కంపెనీ.. రూ.1300 కోట్ల డీల్..!
హైదరాబాద్ కు చెందిన సాయి పేరెంటరల్స్ కంపెనీ జాక్ పాట్ కొట్టింది. సాయి పేరెంటరల్స్ ఆస్ట్రేలియన్ అనుబంధ సంస్థ అయిన నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ పిటివై, ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫార్మసీతో భారీ ఒప్పందం చేసుకుంది. దీర్ఘకాలిక ప్రత్యేక ఓవర్ ది కౌంటర్ (OTC) మందుల సరఫరా ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ. 1300 కోట్లుగా ఉంది. ఈ ప్రత్యేక OTC మందుల సరఫరా ఒప్పందం 7.5 సంవత్సరాలు కాలానికి ఉంటుందని కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ లో తెలిపింది. పరస్పర అంగీకారంతో మరో 3 సంవత్సరాల పొడిగింపునకు అవకాశం ఉందని వివరించింది. ఏటా 12 కొత్త ప్రోడక్టులు జత అవుతుండటం వల్ల కాంట్రాక్టు విలువ, పరిధి పెరుగుతుందని అంచనా వేస్తోంది.
ఈ లావాదేవీ సంబంధిత పక్షాల లావాదేవీల పరిధిలోకి రాదని కంపెనీ పేర్కొంది. ఇది స్వతంత్ర వాణిజ్య పద్ధతిలో జరిగిందని సాయి పారెంటరల్స్ స్పష్టం చేసింది. తయారీ, ఉత్పత్తి సేకరణ, నియంత్రణ సమ్మతి, టీజీఏ రిజిస్ట్రేషన్లు, గిడ్డంగులు, నాణ్యత హామీ, దేశవ్యాప్త పంపిణీ వంటి బాధ్యతలను నౌమెడ్ ఒకే భాగస్వామిగా నిర్వహించడం కొనసాగిస్తుంది.తమ అనుబంధ సంస్థ అయిన నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్‌పై ఈ డీల్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫార్మసీ గ్రూపులు ఉంచుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని సాయి పేరెంటరల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కరుసాల తెలిపారు.

గత కొన్నేళ్లుగా ఈ భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందిందని నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ మార్క్ థుల్‌బోర్న్ చెప్పారు. చాలా సుదీర్ఘ కాలం పాటు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. 2001లో స్థాపించిన సాయి పేరెంటరల్స్ లిమిటెడ్, భారత్, ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది ఒక గ్లోబల్ ఐపీ-ఆధారిత ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ కంపెనీ. కాగా హైదరాబాద్ కేంద్రంగా అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, దివిస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, నాట్కో ఫార్మా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications