Nazara Technologies: నజరాకు షాక్.. రూ1120 కోట్లకు నోటీసులు..!
మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది నజరా టెక్నాలజీస్ కంపెనీ పరిస్థితి. ఇప్పటికే జీఎస్టీ విధింపుతో గేమింగ్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా నజారా టెక్నాలజీస్ కంపెనీకి చెందిన రెండు అనుబంధ సంస్థలు నోటీసులు అందుకున్నాయి. రూ.1120 కోట్ల జీఎస్టీ బకాయిల చెల్లింపునకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో GST డిమాండ్ నోటీసును స్వీకరించడం గురించి కంపెనీ తెలియజేసింది.
తమ రెండు అనుబంధ సంస్థలైన ఓపెన్ ప్లే టేక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హలాప్లే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లకు ఈ నోటీసు అందిందని కంపెనీ తెలిపింది. BSE, NSEతో రెగ్యులేటరీ ఫైలింగ్‌లలో, కంపెనీ తన అనుబంధ సంస్థ ఓపెన్‌ప్లే టెక్నాలజీస్ 2017-18 నుండి 2022-23 కాలానికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్, కోల్‌కతా నుండి 845.72 కోట్ల రూపాయల జిఎస్‌టి రీఫండ్‌ను అందుకుంది.

కంపెనీకి చెందిన ఇతర అనుబంధ సంస్థ హాలాప్లే టెక్నాలజీస్ కూడా అదే కాలానికి రూ. 274.21 కోట్ల GST బకాయిల కోసం కోల్‌కతాలోని GST ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ నుంచి నోటీసును అందుకుంది. రెండు అనుబంధ కంపెనీలు తమ న్యాయ సలహాదారులు, పన్ను సలహాదారులతో భవిష్యత్తు చర్యలకు సంబంధించి నోటీసుపై చర్చిస్తున్నాయని కంపెనీ తన బిఎస్‌ఇ ఫైలింగ్‌లో తెలిపింది. స్థూల గేమింగ్ రాబడికి బదులుగా ప్లేయర్‌లు పూల్ చేసిన డబ్బుపై GSTని లెక్కించిన తర్వాత ఈ క్లెయిమ్ చేసినట్లు కంపెనీ తెలిపింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికంలో జనవరి నుంచి మార్చి వరకు ఈ రెండు అనుబంధ కంపెనీలు కంపెనీ మొత్తం రాబడికి 2 శాతం కంటే తక్కువ అందించాయని, కంపెనీ లాభంలో 1 శాతం కంటే తక్కువ వాటాను అందించాయని నజారా టెక్నాలజీస్ తెలిపింది. జూలై 16, 2024న చివరి ట్రేడింగ్ సెషన్‌లో నజారా టెక్నాలజీస్ స్టాక్ 1.54 శాతం జంప్‌తో రూ.922.55 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications