లండన్ కేంద్రంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'నథింగ్' (Nothing).. భారతీయ మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవడానికి సిద్ధమైంది. ఈ ఏడాది 'నథింగ్ ఫోన్ 4' రావడం లేదని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ.. దానికి బదులుగా నథింగ్ 4a , నథింగ్ 4a ప్రో మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త సిరీస్ ద్వారా కంపెనీ తన సేల్స్ వాల్యూమ్ ను భారీగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మార్చి 5న కీలక లాంచ్?
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ సమాచారం ప్రకారం.. నథింగ్ 4a సిరీస్ భారతదేశంలో మార్చి 5 న విడుదలయ్యే అవకాశం ఉంది. వ్యాపార కోణంలో చూస్తే, గతేడాది విడుదలైన మోడల్స్ కంటే ఈసారి మెరుగైన స్టోరేజ్ (UFS 3.1) , పెద్ద బ్యాటరీలతో రావడం ద్వారా.. పోటీ కంపెనీలైన వన్ ప్లస్, శామ్‌సంగ్‌లకు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ప్రొడక్ట్ స్ట్రాటజీ , ఫీచర్లు
నథింగ్ సంస్థ ఈసారి రెండు వేర్వేరు ధరల విభాగాలను టార్గెట్ చేస్తోంది:
- Nothing 4a (మిడ్ రేంజ్): ఇది సుమారు రూ. 32,000 ధరతో ఉండవచ్చని అంచనా. ఇందులో 6.82-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్, 5,500mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. యువతను, బడ్జెట్ ప్రీమియం కోరుకునే వారిని ఈ మోడల్ ఆకర్షించవచ్చు.
- Nothing 4a Pro (ప్రీమియం): దీని ధర సుమారు రూ. 45,000 వరకు ఉండొచ్చు. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ , 144Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చే ఈ ఫోన్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే బిజినెస్ క్లాస్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
పెరగనున్న ధరలు.. లాభం ఎంత?
గత మోడల్స్ తో పోలిస్తే ఈసారి ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మెరుగైన హార్డ్‌వేర్ , ఆండ్రాయిడ్ 16 (ప్రో మోడల్‌లో) సపోర్ట్ వంటి అంశాలు కంపెనీ మార్జిన్లను పెంచేందుకు దోహదపడతాయి. నథింగ్ తన యూనిక్ డిజైన్ తో ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకుంది. ఇప్పుడు ఈ కొత్త మోడల్స్ ద్వారా మార్కెట్ షేర్‌ను విస్తరించుకోవాలని చూస్తోంది.
మొత్తంగా చూస్తే ఇండియన్ మార్కట్లో నిలదొక్కుకోవడానికి నథింగ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రాథమిక అంచనాలు మాత్రమే. అధికారికంగా కంపెనీ ప్రకటించే వరకు మనం వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ ఫీచర్లు, ధరలు నిజమైతే 2026 లో నథింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కీలక పాత్ర పోషించడం ఖాయం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications