ఆన్లైన్లో విద్వేషాలు, బెదిరింపులకు దూరంగా ఉండాలని నెటిజన్లకు టాటా గ్రూప్ గౌరవాధ్యక్షులు రతన్ టాటా పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఇది ఒకరికి మరొకరు సాయం అందిపుచ్చుకోవాల్సిన సమయమని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా పరస్పర దూషణలతో మనస్సులు గాయపరుచుకుంటున్నారన్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

సవాళ్లతో నిండిన సంవత్సరం
'ఈ ఏడాది ప్రతి ఒక్కరికి సవాళ్లతో కూడుకున్నది. నెటిజన్లు తొందరపాటు నిర్ణయాలతో, దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒకరిని మరొకరు కిందకు లాగే సమయం కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వీటికి దూరంగా ఉండటంతో పాటు ఒకరికి మరొకరు సాయం అందించుకోవాలి' అని పేర్కొన్నారు. ఇది సవాళ్లతో నిండిని సంవత్సరమని ఆదివారం పోస్ట్ చేశారు.

అలా మారుతుందని ఆశ
ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి పట్ల మరొకరికి దయ, అవగాహన, సహనం అవసరమని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం అందరం ఏకతాటి పైకి రావాల్సి ఉందన్నారు. అసలు తాను ఆన్‌లైన్‌లో గడిపేది చాలా తక్కువ సమయమని, ద్వేషం, వ్యతిరేకతలను పక్కన పెట్టి, ఇది అందరికీ మంచి చేసే ప్రదేశంగా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నెటిజన్ల మనసు గెలుచుకున్న పోస్ట్
రతన్ టాటా ట్వీట్‌కు చాలామంది నెటిజన్లు స్పందించారు. అతను చాలా గ్రేట్ అని ఎందుకు అంటారో మరోసారి నిదర్శనంగా నిలిచిందని ఓ నెటిజన్, మీరు నెపోటిజాన్ని సపోర్ట్ చేయరని మరో నెటిజన్ ఇలా పలు రకాలుగా రతన్ పోస్ట్‌కు పట్ల ఆకర్షితులయ్యారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అహుజా మనసును కూడా ఈ పోస్ట్ గెలుచుకుంది. కొద్ది గంటల్లోనే దాదాపు 4 లక్షల వచ్చాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications