యోనో యాప్ ద్వారా ఎమర్జెన్సీ లోన్స్ ఇవ్వట్లేదు, వారికి మాత్రమే ఇచ్చే ప్రయత్నం: ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు యోనో యాప్ ద్వారా ఎమర్జెన్సీ లోన్స్ ఇస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఎస్బీఐ తాజాగా ప్రకటన చేసింది. యోనో ప్లాట్‌ఫాం ద్వారా తాము ఎలాంటి లోన్ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎమర్జెన్సీ లోన్స్ ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయని, అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఇదీ విషయం.. కానీ ఇవ్వడం లేదు
ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రూ.5 లక్షల వరకు ఎమర్జెన్సీ లోన్స్ ఇస్తోందని, ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే డబ్బులు మంజూరు చేస్తోందని వార్తలు వచ్చాయి. వీటికి 10.5 శాతం వడ్డీ మాత్రమేనని, ఈ ఈఎంఐని కూడా తీసుకున్న ఆరు నెలల తర్వాత నుండి చెల్లించడం ప్రారంభించవచ్చునని కూడా వచ్చాయి. అయితే వదంతులేనని, మీడియాలో కూడా వార్తలు వచ్చాయని, తాము ఇవ్వడం లేదని తెలిపింది.

వారికి మాత్రమే.. ప్రయత్నాలు
తమ బ్యాంకు ఖాతా ద్వారా వేతనం పొందేవారికి, ముందస్తుగా ఆమోదించిన పర్సనల్ లోన్స్‌ను మాత్రమే యోనో ప్లాట్ ఫామ్ పైన అందించే ప్రయత్నాలు సాగుతున్నాయని ఎస్బీఐ తెలిపింది. కానీ కరోనా కారణంగా ఎమర్జెన్సీ రుణాలు ఇస్తున్నామనే వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. యోనో యాప్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ప్రవేశపెట్టే ప్రయత్నంలో మాత్రమే ఉన్నట్లు చెప్పింది.

డిజిటల్ సర్వీస్ ప్లాట్‌ఫామ్.. యోనో
యోనో యాప్ (You Only Need One) ఎస్బీఐ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్. కస్టమర్లకు బ్యాంకింగ్‌కు సంబంధించి ఇది ఆల్ ఇన్ వన్ సొల్యూషన్. షాపింగ్, లైఫ్‌స్టైల్, ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి సేవలు ఈ యాప్ ద్వారా లభిస్తాయి. ఈ యాప్ నుండే కరోనా కారణంగా నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న తమ కస్టమర్లకు ఊరట


Click it and Unblock the Notifications