ఒకప్పుడు మొబైల్స్ వాడుకలోకి వచ్చాక టెలికాం రంగంలో కూడా కొత్త కొత్త నెట్వర్కులు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో పదుల సంఖ్యలో నెట్వర్కులు ఉండేవి, కానీ ప్రస్తుతం 5 కంటే తక్కువ టెలికాంలు మాత్రమే ఉన్నాయి. అయితే అప్పట్లో ఉన్న టెలికాం కంపెనీలలో ఎయిర్ సెల్ చాల మందికి గుర్తుండే ఉంటుంది. కానీ కరోనాకి ముందు ఈ టెలికాం కంపెనీ కస్టమర్లకు గుడ్ బై చెప్తూ కనుమరుగైంది. అయితే ఈ టెలికాం గురించి ప్రస్తుతం ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏంటంటే టెలికాం రంగంలోని పెద్ద కంపెనీలలో ఒకటైన ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ ఇటీవల తన జీవితం, వ్యాపార నిర్ణయాల గురించి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఆ సమయంలో తన వ్యాపారం నాశనమవడానికి ఏ తప్పులు కారణమయ్యాయో చెప్పుకొచ్చాడు.

తమిళనాడులో పెరిగిన శివశంకరన్ తన కెరీర్ విజయ రహస్యం తరువాత తన పతనం గురించి ఒక పాడ్‌కాస్ట్‌లో "నేను నా జీవితంలో రెండు తప్పులు చేయకపోతే ఈరోజు నాకు రూ. 1000 కోట్ల విలువైన ఆస్తులు ఉండేవి. ఇందులో మొదటి తప్పు నేడు హిందీ నేర్చుకోకపోవడం. నేను హిందీ నేర్చుకొని ఉంటే నేను 140 కోట్ల మంది భారతీయులను తన కంపెనీతో కలిపేవాడిని" అని అన్నారు.
ముంబై లేదా ఢిల్లీకి మారి ఉండాల్సింది: శివశంకర్ దీనిపై మాట్లాడుతూ నా రెండవ తప్పు ఏమిటంటే నేను చెన్నై నుండి ముంబై లేదా ఢిల్లీకి మారాల్సింది. నా యవ్వనంలో ఢిల్లీ లేదా ముంబైకి వెళ్లి హిందీ నేర్చుకుని ఉంటే నేను ఖచ్చితంగా లక్ష కోట్లు సంపాదించేవాడిని. హిందీ భాష తెలియకపోవడం వల్ల దేశంలోని చాలా ప్రాంతాలతో తనకు సంబంధాలు లేకుండా పోయాయని, ఫలితంగా పెద్ద వ్యాపార అవకాశాలను కోల్పోయానని ఆయన నమ్ముతున్నారు. అంతేకాకుండా ఢిల్లీ లేదా ముంబైలో ఉండటం ద్వారా కలిగే నెట్‌వర్కింగ్ ప్రయోజనాలు అతనికి లభించకుండా పోయాయి.
1999లో స్థాపించిన ఎయిర్‌సెల్: శివశంకరన్ 1999లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఎయిర్‌సెల్‌ను స్థాపించారు. తరువాత కంపెనీ టెలికాం పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంది. అలాగే కంపెనీ సొంత మార్కెటింగ్‌పై దృష్టి సారించింది ఇందుకు కంపెనీని వేగంగా విస్తరించడానికి పరిచయాలను ఎంతో సద్వినియోగం చేసుకుంది. ఆ కాలంలోనే ఎయిర్‌సెల్ లక్షలాది మంది కస్టమర్లను చేర్చుకుంది. జీవితంలో అంతా సాఫీగా సాగుతున్న టైంకి 2006 సంవత్సరంలో అకస్మాత్తుగా అతని జీవితంలో ఒక మలుపు తిరిగింది, అదే అతని వ్యాపారం పతనానికి ప్రారంభమైంది.
నిజానికి 2006లో అతను ఎయిర్‌సెల్‌లో 74% వాటాను మలేషియాకు చెందిన మాక్సిస్ కమ్యూనికేషన్స్‌కు విక్రయించాడు, అది తరువాత అతనికి ఇబ్బందికరమైన డీల్ అని తెలిసింది. ఈ ఒప్పందం 2011 సంవత్సరంలో వివాదానికి దారితీసి, శివశంకరన్ తన వాటాను కూడా మాక్సిస్‌కు విక్రయించవలసి వచ్చిందని ఆరోపించారు. ఇక్కడి నుండి ఎయిర్‌సెల్ వ్యాపారం చేయడం కష్టమైంది. చివరకు ఫిబ్రవరి 2018లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంపెనీ టెలికాం మార్కెట్ నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
More From GoodReturns

Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications