For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది బంగారం కాదు.. అంతకంటే విలువైనది: ఈ ఏడాది రూ.1,42,127కు పెరిగింది

|

భారతీయులకు బంగారంపై ఎక్కువ మోజు. ఆ తర్వాత వెండికి డిమాండ్ ఉంటుంది. ఇటీవల గత కొద్ది నెలల్లో బంగారం ధర ఏకంగా రూ.6,000 నుంచి రూ.8,000 వరకు పెరిగింది. ఐదు నెలల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.33వేలు చూడగా, సెప్టెంబర్ నెలలో రూ.40,000 దాటి గరిష్టస్థాయికి చేరుకుంది. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం రికార్డ్ హైకి (రూ.40,000) రూ.2,000కు అటు ఇటుగా తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం కొద్ది రోజుల క్రితం 1,550 డాలర్లతో రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు 1,480 డాలర్ల వద్ద ఉంది. 70 డాలర్లు తగ్గింది.

2 రోజుల్లో నెంబర్ పోర్టబిలిటీ, కస్టమర్‌కూ షరతులు2 రోజుల్లో నెంబర్ పోర్టబిలిటీ, కస్టమర్‌కూ షరతులు

బంగారం కంటే ఎన్నో రెట్లు పెరిగింది

బంగారం కంటే ఎన్నో రెట్లు పెరిగింది

ఇటీవలి కాలంలో బంగారం ధర భారీగా పెరిగింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో బంగారం దాదాపు 20 శాతం పెరిగింది. బంగారం ధరలు ఇలా పెరగడంతో కొనుగోళ్లు కూడా భారీగా తగ్గాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు కాస్త ఊపందుకుంటున్నాయి. అయితే గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. అయితే బంగారం కంటే మరో విలువైన లోహం ఈ ఏడాదిలో అంతకంటే ఎన్నో రెట్లు పెరగడం గమనార్హం.

ఏకంగా 2,000 డాలర్లు దాటిన పల్లాడియం

ఏకంగా 2,000 డాలర్లు దాటిన పల్లాడియం

ఆ మెటల్ పల్లాడియం. విదేశాల్లో దీని ధర ఏకంగా ఔన్సుకు 2,000 డాలర్లు దాటింది. దీని ధర ఇంతలా పెరగడం ఇది మొదటిసారి. ఈ ఏడాదిలో పల్లాడియం ఏకంగా 57 శాతం పెరిగింది. ఇది మెటల్ ప్రొడ్యూసర్స్‌కు శుభవార్తే. దీనిని ప్రధానంగా ఆటో కేటలిస్ట్‌లో ఉపయోగిస్తారు. వీటికి సంబంధించిన షేర్లు అంతర్జాతీయస్థాయిలో భారీగా పెరిగాయి.

షేర్లు దూసుకెళ్లాయి

షేర్లు దూసుకెళ్లాయి

నెంబర్ 1 మైనర్ MMC Norilsk Nickel PJSC షేర్లు 2019లో ఏకంగా 51 శాతం పెరిగాయి. సౌతాఫ్రికా మెటల్ ఉత్పత్తిదారులకు ఇది భారీ లాభాలు తీసుకు వచ్చింది. FTSE/JSE ఆఫ్రికా ప్లాటినం మైనింగ్ ఇండెక్స్ ఈ ఏడాది ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఓ ఏడాదిలో ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. పల్లాడియం ధరలు పెరిగినప్పటికీ కారు ఉత్పత్తిదారులపై అంతగా ప్రభావం పడలేదు. ఎందుకంటే ఉత్పత్తి ఖర్చులో దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.

వచ్చే అర్ధ సంవత్సరంలో భారీ పెరుగుదల

వచ్చే అర్ధ సంవత్సరంలో భారీ పెరుగుదల

స్పాట్ పల్లాడియం ఔన్స్ ధర బుధవారం ఉదయం న్యూయార్క్‌లో 1.1 శాతం పెరిగి 2,000.35 డాలర్లుగా ఉంది. కఠినమైన ఉద్ఘార నియమాల కారణంగా పల్లాడియంకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. వచ్చే ఏడాది అర్ధ సంవత్సరంలోనే ఈ ధరలు ఏకంగా 2,500 డాలర్లకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

English summary

ఇది బంగారం కాదు.. అంతకంటే విలువైనది: ఈ ఏడాది రూ.1,42,127కు పెరిగింది | Not gold or silver, price of this metal up 57% this year. Tops $2,000 today

Palladium rose above $2,000 an ounce for the first time, extending a powerful annual advance driven by a sustained global deficit.
Story first published: Wednesday, December 18, 2019, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X