ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు జూలై 31 వరకు మాత్రమే గడువు ఉంది. అంటే ఇంకో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. చివరి క్షణంలో ఆందోళన చెందకుండా వెంటనే దానిని పూర్తి చేయటం మంచిది.
చాలా మంది ప్రభుత్వం చివరి క్షణంలో దాఖలు గడువును పొడిగించవచ్చని భావిస్తుంటారు. కానీ ఈసారి ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆ ఆలోచనలో లేవని ఇప్పటికే వెల్లడైంది. మీరు స్వయంగా అధికారిక ప్రభుత్వ పోర్టల్ incometax.gov.in ద్వారా ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రైవేట్ ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్ సౌలభ్యాన్ని ఉపయోగించినట్లయితే ఇందుకు మీకు రూ.200 నుంచి రూ.250 ఖర్చవుతుంది. అధిక తగ్గింపులు పొందేందుకు సీఏ సహాయం తీసుకున్నట్లియితే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.]

గడువు ముగిసిన తర్వాత అంటే జూలై 31 ముగిసినాక కూడా మనం ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. తప్పులు లేకుండా ITRను సరిగ్గా ఫైల్ చేయడం చాలా ముఖ్యమైన పని. లేకుంటే అది అనేక ఆర్థికపరమైన చిక్కులకు దారితీసే ప్రమాదం ఉంది. జూలై 31 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో రిటర్న్ ఆలస్యంగా ఫైల్ చేసే వారిపై ఆదాయాన్ని బట్టి లేటు రుసుము రూ.5,000 వరకు ఉంటుంది. అలాగే ఆలస్యం చేసిన కాలానికి 1 శాతం వడ్డీ విధించబడుతుంది.
ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని తక్కువగా అంచనా వేసినందుకు 50% వరకు, ఆదాయాన్ని తప్పుగా పేర్కొన్నందుకు 200% వరకు జరిమానా విధించవచ్చు. రిటర్న్ దాఖలు చేయని పక్షంలో 3 నెలల నుంచి గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్, జరిమానాతో ప్రాసిక్యూషన్ నోటీసులను పన్ను అధికారుల నుంచి అందుకునే ప్రమాదం ఉంది. అందువల్ల సకాలంలో సరైన వివరాలతో ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలని టాక్స్ నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications