భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఒక మంచి అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్, సొంత స్థలం కోసం హోమ్ లోన్ తీసుకుంటుంటారు. కానీ మన దేశంలోని అత్యంత ధనవంతులు అంటే సూపర్ రిచ్‌లు మాత్రం వేరే ప్రపంచంలో నివసిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు స్టాక్ మార్కెట్ షేర్లు, క్రిప్టో కరెన్సీ వంటి పెట్టుబడులను పక్కన పెట్టి భూమి, రియల్ ఎస్టేట్ ఆస్తులపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అసలు వీళ్లేందుకు అలా చేస్తున్నారో తెలుసా ?

లగ్జరీ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఐశ్వర్య కపూర్ విశ్లేషణ ప్రకారం భారతదేశంలోని 0.001% మంది అత్యంత ధనవంతులు. వీళ్ళు భారీ పెట్టుబడులను బంగారం, స్టాక్స్, క్రిప్టోకరెన్సీలో కాకుండా పూర్తిగా భూమి ఇంకా రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు. ఇంకా ఇళ్లను కొనుగోలు చేయడమే కాకుండా ఢిల్లీ, ముంబై, గోవా, దుబాయ్, లండన్ వంటి ప్రముఖ నగరాల్లో వాణిజ్య సముదాయాలు, భూములు, లగ్జరీ పెంట్‌హౌస్‌లు, బ్రాండెడ్ అపార్ట్‌మెంట్‌లను కూడా ప్రీ-లీజుకు తీసుకుంటున్నారు.
భూమిపై పెట్టుబడికి కారణాలివే: అత్యంత ధనవంతులు స్టాక్‌లు, క్రిప్టో కంటే భూమిలో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణాలు చూస్తే ద్రవ్యత, భద్రత, వారసత్వం ఇంకా గోప్యత. భూమిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్నులను తగ్గించుకోవడంతో పాటు చట్టబద్ధంగా డబ్బును ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా వారికి లభిస్తుంది.
ఒక ఉదాహరణకి చూస్తే దక్షిణ ఢిల్లీలో రూ.220 కోట్ల విలువైన బంగ్లాను అమ్మేసి గుర్గావ్‌లో రూ.75 కోట్లకు బ్రాండెడ్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన ఒక కుటుంబం వారి ప్రతిష్టను నిలుపుకుంటూనే రూ.145 కోట్లు నగదు రూపంలో ఆదా చేసుకోగలిగింది. ఐశ్వర్య కపూర్ దీన్ని "స్మార్ట్ సైజింగ్" అని పిలుస్తారు. అంటే జీవిత సంక్షేమం, నగదు ప్రవాహం, సంప్రదాయం సమతుల్యంగా ఉండే వ్యవస్థ.
భవిష్యత్తులో భూమి పై బంపర్ రాబడి: ప్రస్తుతం రూ.25 కోట్లకు కొనుగోలు చేస్తున్న భూమి భవిష్యత్తులో మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణ విస్తరణ, కొత్త రోడ్లు, మెట్రో ప్రాజెక్టులు, ఐటీ పార్కులు వంటివి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ భూములు భవిష్యత్తులో భారీ రాబడి ఇవ్వగలవు.
అత్యంత ధనవంతులైన భారతీయులు ఎలా పెట్టుబడి పెడతారు: బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, లీజుకు ఇచ్చే కమర్షియల్ స్థలం, ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చెందగల భూమి, ఇలాంటి అవకాశాలు తరచుగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లు అలాగే ప్రత్యేక ఏజెంట్ల ద్వారా మాత్రమే లభిస్తాయి.
భారతదేశంలోని సంపన్నులు భూమిని వారసత్వ ఆస్తిగా భావిస్తారు. ఇంకా చట్టపరమైన పరిమితులకు లోబడి ఉండదు. అందుకే వీళ్ళు బంగారం, స్టాక్స్, క్రిప్టో కంటే భూమినే ఎంచుకుంటారు. ప్రభుత్వం కూడా భూ సమస్యలను పరిష్కరించి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
More From GoodReturns

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

కేవలం SIP ఉంటే సరిపోదు.. మీ సంపదను కాపాడే 'మినిమాక్స్' సూత్రం మీకు తెలుసా?

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!



Click it and Unblock the Notifications