పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై ఆయన తొలిసారి స్పందించారు. కేంద్రం ఇంధన ధరలపై సుంకాన్ని గత నవంబర్ నెలలోనే తగ్గించిందని, కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆ పన్నులను తగ్గించలేదని చెప్పారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఆయా రాష్ట్రాలు ఇప్పటికైనా ఇంధన ధరలను తగ్గించాలని కోరారు.
ఇది విమర్శ కాదని, కేవలం విజ్ఞప్తి మాత్రమేనని కూడా ప్రధాని మోడీ చెప్పారు. గత నవంబర్ నెలలో చమురు ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని కోరామని గుర్తు చేశారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు తగ్గించలేదని, కానీ ఆ రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తితో ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని కోరారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... ఒకవేళ కర్నాటక కనుక పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించకపోయి ఉంటే కనుక గత ఆరు నెలల కాలంలో అదనంగా రూ.5,000 కోట్లు ఆర్జించి ఉండేదని చెప్పారు. గుజరాత్ సామాన్యులపై పెట్రో భారాన్ని తగ్గించకపోయి ఉంటే ఆ రాష్ట్రం కూడా రూ.3500 కోట్లు వెనుకేసి ఉండేదన్నారు. అదే సమయంలో ఈ ఆరు నెలల కాలంలో గుజరాత్, కర్నాటక పక్కన ఉన్న వ్యాట్ తగ్గించని రాష్ట్రాలు రూ.3500 కోట్ల నుండి రూ.5000 కోట్లు ఆర్జించాయన్నారు.
వ్యాట్ తగ్గించని రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయని మోడీ వివరించారు. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.111, జైపూర్‌లో రూ.118, హైదరాబాద్‌లో రూ.119, కోల్‌కతాలో రూ.115, ముంబైలో రూ.120గా ఉందన్నారు. కానీ, డామన్ అండ్ డయ్యులో రూ.105 మాత్రమే అని గుర్తు చేశారు. కాగా, అహ్మదాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105, బెంగళూరులో రూ.111, ఉత్తరాఖండ్‌లో రూ.103, లక్నోలో రూ.105గా ఉంది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications