సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న GST 2.0 వల్ల దేశవ్యాప్తంగా వినియోగదారుల ఖర్చుల్లో మార్పులు రానున్నాయి. పలు ఉత్పత్తులపై పన్ను తగ్గడంతో, చాలా వస్తువులు చౌక అవుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ మార్పులు రోజువారీ ఖర్చులపై కొంత ఉపశమనం ఇవ్వబోతున్నాయి.
కానీ అందరి దృష్టి సారించిన అమూల్ డైరీ ఉత్పత్తుల విషయంలో మాత్రం వాస్తవం కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే, పాలు లాంటి ప్రధాన ఉత్పత్తుల్లో అన్ని చోట్ల ధరలు తగ్గవు. పౌచ్ పాలు మారకుండా ఉండగా, UHT milk మాత్రం చౌక అవబోతున్నాయి. ఈ కొత్త GST 2.0 మార్పులు భారత కుటుంబాలపై ఎలా ప్రభావం చూపబోతున్నాయి, అముల్ ఉత్పత్తులపై ఎలా మార్పు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

ఇందుకు ప్రధాన కారణం ఈ పౌచ్ పాలపై ఇప్పటికీ 0% GST ఉంది. అంటే ఇప్పటివరకు కూడా ట్యాక్స్ లేదు, కొత్తగా కూడా ఎలాంటి రాయితీ రాబోదు. కాబట్టి ధరలు తగ్గే అవకాశం లేదు అని కంపెనీ స్పష్టం చేసింది. GCMMF మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ "పౌచ్ పాలపై ఎప్పటినుంచో GST లేదు... కాబట్టి కొత్త మార్పుల వల్ల ధరలు తగ్గవు" అని తెలిపారు.
UHT పాలు
గతంలో వచ్చిన కొన్ని రిపోర్టుల్లో "పౌచ్ పాల ధర రూ.3 - రూ.4 తగ్గవచ్చని" చెప్పినా, అది తప్పని అముల్ చెప్పింది. ఈ కొత్త GST 2.0లో ధర తగ్గేది కేవలం UHT పాలు పైనే. ప్రస్తుతం UHT పాలపై 5% GST ఉంది. సెప్టెంబర్ 22 నుంచి ఇది జీరో శాతంకి తగ్గుతుంది. దీంతో దీర్ఘకాలం నిల్వ ఉండే ఈ పాలు మరింత చౌక అవుతాయి. జయెన్ మెహతా కూడా సెప్టెంబర్ 22 నుంచి కేవలం UHT పాలపైనే ధర తగ్గుతుంది. పౌచ్ పాల ధరలో ఎలాంటి మార్పు ఉండదు అన్నారు.
UHT పాలు అంటే ఏంటి?
UHT పాలు అంటే అల్ట్రా-అధిక ఉష్ణోగ్రత ప్రాసెస్ చేసిన పాలు. వీటిని సుమారు 135°C వరకు కొన్ని సెకన్లు వేడి చేస్తారు, దీని వలన అందులో ఉన్న సూక్ష్మజీవులు దాదాపు పూర్తిగా చనిపోతాయి. తర్వాత ఈ పాలను టెట్రా ప్యాక్ లాంటి ప్రత్యేక ప్యాకేజింగ్‌లో నింపుతారు. ఈ ప్రాసెస్ వల్ల వీటిని ఫ్రిజ్‌లో పెట్టకుండానే కొన్ని నెలలు నిల్వ చేసుకోవచ్చు. అంటే, రెగ్యులర్ పాలను రోజూ కొనాల్సిన టెన్షన్ లేకుండా, ఈ పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు.
GST 2.0 వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించి, జీవన వ్యయాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యం. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న ఈ రీఫార్మ్‌ని ఈ ఏడాది పండుగ సీజన్‌లో ప్రజలకు పెద్ద రిలీఫ్గా చూస్తున్నారు.
రోజువారీ ఖర్చుల్లో పాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి, పౌచ్ పాలు ధరలు మారకపోవడం ప్రతి కుటుంబానికి రిలీఫ్‌గా ఉంటుంది. ఇదే సమయంలో, GST 2.0 వల్ల ఇతర ఆహార వస్తువులు చౌక అవుతే, ఇంటి ఖర్చుల్లో కొంత పొదుపు అవుతుంది. దాంతో పాలు ధరలు పెరిగినా పెద్దగా భారం అనిపించకపోవచ్చు.
ఇక డైరీ పరిశ్రమకూ ఈ మార్పులు పెద్ద మార్పులు తీసుకురావచ్చు. UHT పాలకి డిమాండ్ పెరిగితే, గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) లాంటి కంపెనీలు ప్రాసెసింగ్ యూనిట్లలో పెట్టుబడులు పెంచవచ్చు. దీంతో రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ పాలు సులభంగా అందుబాటులోకి వచ్చి, సప్లై చైన్ బలపడుతుంది. రైతులకు కూడా ఈ పెరుగుదల లాభదాయకం అవుతుంది.
డైరీ పరిశ్రమకూ మన దేశ GDP లో కూడా మంచి పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం పాలు అమ్మడమే కాదు. పాలు ఉత్పత్తి చేసే రైతులు, పాలను ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీలు, ప్యాకేజింగ్, ట్రాన్స్‌పోర్ట్, డిస్ట్రిబ్యూషన్ ఇలా చాలా రంగాల్లో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తోంది. పాలు డిమాండ్ పెరిగితే రైతుల ఆదాయం పెరుగుతుంది, వాళ్లు మరింత ఖర్చు చేస్తారు. దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గిరాకీ పెరుగుతుంది. ఇదంతా కలిపి దేశ ఆర్థిక వృద్ధికి, అంటే GDP పెరుగుదలకు సహాయపడుతుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications