కార్పొరేట్ ఉద్యోగం అంటే భద్రత అనుకుంటాం. కానీ జీతం రాకపోతే ఆ భద్రతే ప్రశ్నార్థకం. ఒక ఉద్యోగి తన కంపెనీ గేటు వద్ద పడుకుంటే, దానికి కారణం ఏంటి? ఈ సంఘటన ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితిపై పెద్ద ప్రశ్నను లేవనెత్తింది.

పూణేలోని TCS ఆఫీస్ బయట ఒక ఉద్యోగి రోడ్డు పక్కన పడుకుని, జీతం ఇవ్వాలంటూ నిరసన తెలిపిన ఈ ఉద్యోగి విషయం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. సౌరభ్ మోర్ అనే పేరుతో ఉన్న ఆ వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌరభ్ మోర్ అనే TCS ఉద్యోగికి జీతం ఇంకా ఇవ్వకపోవడంతో, జూలై 29 నుండి పుణేలోని TCS సహ్యాద్రి పార్క్ ఆఫీస్ బయట ఫుట్‌పాత్‌పైనే ఉన్నాడు. తాను పడుకునేందుకు తన బ్యాగ్‌ను దిండుగా వాడుకున్నాడు. ఆయన పక్కన ఒక చేతితో రాసిన లేఖ కూడా ఉంచారు. ఆ లేఖలో చెప్పిన ముఖ్య విషయాలు చూస్తే:
తాను జూలైలో రిపోర్ట్ చేసినప్పటికీ, ఇప్పటివరకు జీతం రాలేదని ఆ లేఖలో పేర్కొన్నాడు. తన ID యాక్టివేట్ కాలేదని, హెచ్ఆర్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని ఆయన చెప్పారు. ఆఫీసులో అడుగు పెట్టడానికి ప్రయాణ ఖర్చులకే డబ్బులు లేవు. గదికి అద్దె కట్టలేని స్థితి. చివరికి తాను పని చేసే ఆఫీస్‌నే ఆశ్రయం చేసుకున్నాడు. కనీసం అక్కడైనా రాత్రి ఉండొచ్చు అని పేర్కొన్నాడు.
ఈ ఘటనపై ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (FITE) స్పందించింది. "ఇలాంటి కష్ట సమయంలోనూ తన హక్కు కోసం ధైర్యంగా ముందుకొచ్చిన సౌరభ్‌ను అభినందిస్తున్నాం," అని తెలిపింది. ఇలాంటి జీతం ఆలస్యం సమస్యలను శ్రమశాఖలో అధికారికంగా ఫిర్యాదు చేయాలని, అలాగే లీగల్ కంప్లైంట్ చేస్తే పోరాటానికి బలం కలుస్తుందని సూచించింది. ఉద్యోగుల హక్కులు కార్మిక చట్టాల ద్వారా రక్షించ బడతాయని కూడా గుర్తు చేసింది.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో వివిధ వ్యాఖ్యలు వచ్చాయి "చాలా దురదృష్టకరం. టీసీఎస్ ఇప్పుడు టాటా గ్రూప్ విలువలకు విరుద్ధంగా నడుస్తోంది. "రతన్ టాటా తర్వాత టీసీఎస్ మేనేజ్మెంట్ పూర్తిగా మారిపోయింది. ఎలాంటి నైతికత లేదు. "AI దళం వల్ల త్వరలో ఉద్యోగాల తగ్గింపు ఖాయం" అంటూ అన్నారు.
సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అయ్యింది. 'కంపెనీలో ఉద్యోగం ఉంది కానీ పడుకునేది ఫుట్‌పాత్‌పై' అన్న వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆపై, TCS స్పందించి అతని హాజరు అప్రూవ్ కాకపోవడం వల్ల జీతం నిలిపేశామని, కానీ ఇప్పుడు మేము నివాసం ఏర్పాటు చేశామని, అతన్ని మానసికంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. కానీ ఒక ప్రశ్న మిగిలిపోయింది నాలుగు నెలలు పాటు ఎందుకు స్పందించలేదు అని నెటిజన్లు అంటున్నారు.
ఈ సంఘటన చిన్నదిగా కనిపించొచ్చు, కానీ ఇది వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని తక్కువ చేస్తుంది. ఉద్యోగుల రక్షణ కోసం ఉన్న విధానాలు మరింత బలంగా ఉండాలి. జీతం ఆలస్యం అంటే అది ఎప్పుడూ చిన్న విషయం కాదు. అది జీవితం మీద ప్రభావం చూపుతుంది.
TCS వంటి పెద్ద కంపెనీలు ఈ ఘటనను ఒక పాఠంగా తీసుకోవాలి. "సిస్టమ్‌లో పొరపాటు వల్ల ఉద్యోగికి ఇబ్బంది కలిగింది" అనే భావనకన్నా, "అలాంటిది జరగకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలి? అనే దానిపై దృష్టి పెట్టాలి.
ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఇంకా చాలా దారులు ఎదురు చూస్తున్నాయని చూపిస్తున్నాయి.
ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సమస్యలపై శ్రద్ధ చూపాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉద్యోగులు చట్టబద్ధమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలి. తమ హక్కుల కోసం ధైర్యంగా మాట్లాడాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications