IT News: వరుసగా రెండోసారి.. బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగులు మరో పిడుగు..!

Kannadiga Row: బెంగళూరులోని ఎక్కువ మంది నివసించే వారిలో ఐటీ ఉద్యోగులది సింహభాగం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే బెంగళూరు నగరంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారు తగులుతూనే ఉంటారు. కొత్తగా నగరానికి వచ్చినవారికి కూడా ఇది కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటారు.

ఈ క్రమంలో గడచిన కొన్ని నెలలుగా కర్ణాటక వ్యాప్తంగా కన్నడిగ నినాదం వినిపిస్తోంది. స్థానికులకే ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో అగ్రస్థానం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం సైతం ఒక బిల్లును తీసుకొచ్చింది. అయితే పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో దానిని కొన్ని గంటల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది మరువక మునుపే గతవారం సోషల్ మీడియాలో కన్నడిగులకు ఉద్యోగాల నియామకంలో ప్రాథాన్యత ఇవ్వాలంటూ ట్వీట్ సంచలనం రేపింది.

North Indian Supporting Kannadiga debate Sparking Fears in Telugu IT Employees families of Bengaluru

కర్ణాటకలో యువత ఉద్యోగాల కోసం రోడ్లపై యుద్ధం చేయకుండా.. నియమించుకునే స్థాయిలో ఉన్న కీలక ఉద్యోగులు, వ్యవస్థాపకులు పొరుగువారిపై కనికరం చూపకుండా కన్నడిగులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఒక వ్యక్తి చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. దీని తర్వాత తాజాగా ఇదే అంశంపై మరోసారి పెద్ద చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దీనిపై చేసిన వీడియో వైరల్ అవుతోంది. కర్ణాటకలో జరుగుతున్న భాష, సాంస్కృతిక చర్చలో కన్నడిగులకు తన మద్దతును అందించాడు.

కర్ణాటక ఈ విషయంలో సరైన వైపున వాదిస్తోందని అన్నాడు. ప్రస్తుతం కర్ణాటక ప్రజలపై చాలా ద్వేషం పెరుగుతోందని, అయితే వారి భూమి, వారి సంస్కృతి, వారి వారసత్వం, వారి గుర్తింపును కాపాడుకునే హక్కు వారికి ఎల్లప్పుడూ ఉంటుందని సదరు వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశాడు. కర్ణాటక సాంస్కృతిక పోరాటాన్ని కెనడా వలస ప్రకృతి దృశ్యంతో పోల్చి, పెద్ద ఎత్తున వలసలు ఎలా ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నాయో ఆయన గుర్తు చేశాడు. ప్రస్తుతం పంజాబీలు, ఉత్తర భారతీయుల పట్ల కూడా ఇలాంటి ద్వేషం కనిపిస్తోందని అన్నాడు.

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐటీ కంపెనీలు కేవలం స్థానిక భాష మాట్లాడుతూ ఇంగ్లీషు మాట్లాడలేని వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకుంటే క్లయింట్లతో ఎలా కమ్యూనికేట్ చేయటం కుదురుతుందని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. అయితే కన్నడిగులకు ప్రాధాన్యత అంశం రోజురోజుకూ పెద్ద చర్చగా మారుతున్న వేళ బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న తెలుగు కుటుంబాలు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నాయి. ఉద్యోగ భద్రతతో పాటు ఈ అంశం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదాలపై వారు భయం వ్యక్తం చేస్తున్నారు. బతుకు జీవుడా అంటూ తిరిగి సొంటూళ్లకు రావాల్సిన పరిస్థితి వస్తే ఎలా అనే డైలమాలో ఉన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+