బెంగళూరు రియల్ ఎస్టేట్ రేంజ్ మార్చేసిన నార్త్ బెంగళూరు.. ఎందుకంత క్రేజ్?
బెంగళూరు అంటేనే ఐటీ హబ్, ట్రాఫిక్ జామ్‌లు, ఆకాశాన్నంటే ఇంటి అద్దెలు గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు ఐటీ సిటీలో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే నార్త్ బెంగళూరు (North Bengaluru). అవును, ఇప్పుడు బెంగళూరులో ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా నార్త్ బెంగళూరు గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఈ ఏరియా ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది.
2026 మొదటి త్రైమాసికంలో ఇండియాలోనే అత్యంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా బెంగళూరు నిలిచింది. కేవలం మూడు నెలల్లోనే దాదాపు 15,603 ఇళ్లు అమ్ముడయ్యాయంటే ఇక్కడి డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరలు కూడా ఏడాదిలోనే 24 శాతానికి పైగా పెరిగాయి. మరి ఈ గ్రోత్ అంతటికీ మెయిన్ ఇంజన్‌గా మారిన నార్త్ బెంగళూరు కథేంటో ఇప్పుడు చూద్దాం.

ఉద్యోగాల అడ్డాగా నార్త్ బెంగళూరు
ఒకప్పుడు బెంగళూరు అంటే వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వైపే అందరూ చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. నార్త్ బెంగళూరులో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), సరికొత్త స్టార్టప్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కేవలం ఐటీ ఉద్యోగాలే కాకుండా రకరకాల బిజినెస్ హబ్‌లు ఇక్కడ వెలుస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులకు ఆఫీసులకి దగ్గరగా ఇళ్లు కావాల్సి వస్తోంది. దాంతో ఇక్కడ ఇళ్లకు, ఫ్లాట్లకు డిమాండ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది.
మెట్రో వచ్చేస్తోంది.. రూట్ క్లియర్ అవుతోంది!
నార్త్ బెంగళూరు ఇంత ఫాస్ట్‌గా డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్. కనెక్టివిటీని పెంచేందుకు బెంగళూరు మెట్రో ఫేజ్ 3 పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. రాబోయే కొన్ని క్వార్టర్లలోనే ఈ మెట్రో లైన్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల ట్రాఫిక్ తిప్పలు తప్పడమే కాకుండా, ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. ఎక్కడైతే మెట్రో వస్తుందో, అక్కడ భూమి బంగారం అవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే కదా!
ఎయిర్‌పోర్ట్ కారిడార్.. ఇన్వెస్టర్ల కలల ప్రపంచం
కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Kempegowda International Airport) ఈ ఏరియాకి అండగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల కమర్షియల్ కాంప్లెక్స్‌లు, లాజిస్టిక్స్ పార్కులు, భారీ డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా, బిజినెస్ పరంగా కూడా ఈ ఏరియా సెల్ఫ్-సస్టైనబుల్‌గా (స్వయం సమృద్దిగా) మారుతోంది. అంటే, జీవించడానికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడే దొరుకుతున్నాయి.
డిజిటల్ రిజిస్ట్రేషన్.. నమ్మకం పెరిగింది!
ఇక ఇల్లు లేదా స్థలం కొనేవారికి నమ్మకం చాలా ముఖ్యం. బెంగళూరులో ఇప్పుడు డిజిటల్ రిజిస్ట్రేషన్లు, సెంట్రలైజ్డ్ ప్రాపర్టీ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల పేపర్ వర్క్ క్లియర్‌గా ఉంటోంది, మోసపోయే ఛాన్సులు తగ్గాయి. కొనుగోలుదారులలో నమ్మకం పెరగడం వల్ల నార్త్ బెంగళూరులో సేల్స్ మరింత స్పీడందుకున్నాయి.
సప్లై అండ్ డిమాండ్.. పక్కా బ్యాలెన్స్
మార్కెట్‌లో డిమాండ్ ఎంత ఉందో, బిల్డర్లు కూడా అంతే స్థాయిలో కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేస్తున్నారు. 2026 క్యూ1 లో దాదాపు 15,806 కొత్త ఇళ్లు మార్కెట్లోకి వస్తే, 15,603 ఇళ్లు అమ్ముడయ్యాయి. అంటే డిమాండ్, సప్లై పక్కాగా బ్యాలెన్స్ అవుతున్నాయి. ఎక్కడా ఇళ్లు మిగిలిపోయి మార్కెట్ పడిపోయే ఛాన్స్ కనిపించడం లేదు.
మొత్తానికి చూస్తే, ఉద్యోగాలు, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అన్నీ ఒకేసారి తోడవడంతో నార్త్ బెంగళూరు ఫ్యూచర్-రెడీ మార్కెట్‌గా దూసుకుపోతోంది. బెంగళూరు రియల్ ఎస్టేట్ నెక్స్ట్ లెవెల్ గ్రోత్‌కి ఈ ఏరియానే కేరాఫ్ అడ్రస్ కాబోతోంది.


Click it and Unblock the Notifications